Karthikeya 2 Collections: వీకెండ్ తరువాత కూడా తగ్గని హవా.. అంతకుమించి అనేలా ప్రాఫిట్స్
టాలీవుడ్ హీరో నిఖిల్ మొత్తానికి కార్తికేయ 2తో పాన్ ఇండియా మార్కెట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత మళ్లీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అత్యదిక కలెక్షన్స్ సాధించిన హీరోగా ఇప్పుడు అతని పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 17 రోజులైనా కూడా ఏమాత్రం హవా తగ్గలేదు. మొత్తంగా సోమవారం రోజు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ అందుకుంది పెట్టిన పెట్టుబడికి ఎంతగా ప్రాఫిట్ వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు
2014 లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది. దీంతో సినిమాకు మార్కెట్ లో డీసెంట్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

17వ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు
'కార్తికేయ 2' సినిమా 17వ రోజు ఆంధ్ర తెలంగాణలో వసూళ్లు కొంత తగ్గాయి. నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 0.52 కోట్లు షేర్, రూ. 0.95 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి

17 రోజుల టోటల్ కలెక్షన్లు
17 రోజుల్లో 'కార్తికేయ 2' సినిమాకు ఆంధ్ర తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఇక నైజాంలో రూ. 11.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.51 కోట్లు, గుంటూరులో రూ. 2.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.02 కోట్లు, నెల్లూరులో రూ. 98 లక్షలతో.. రూ. 29.85 కోట్లు షేర్, రూ. 49.85 కోట్లు గ్రాస్ దక్కింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కార్తికేయ 2'కు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో రూ. 29.85 కోట్లు షేర్ వచ్చింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.60 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 11.80 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 17 రోజుల్లో కార్తికేయ 2 ప్రపంచ వ్యాప్తంగా రూ. 49.95 కోట్లు షేర్, రూ. 99.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?
'కార్తికేయ 2' సినిమా డీసెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ చేయగా విడుదల తరువాత పాజిటివ్ టాక్ తో పెద్ద సినిమాల తరహాలో డిమాండ్ ఏర్పరచుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదవ్వగా. 17 రోజుల్లో ఈ సినిమాకు రూ. 49.95 కోట్లు షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే 36.55 కోట్ల ప్రాఫిట్ తో అత్యధికంగా లాభాలు అంధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











