Karthikeya 2 Collections: చవితి రోజు కార్తికేయ కుమ్ముడు.. అప్పుడే అన్ని కోట్లు.. కోటి వస్తే చరిత్రే

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్న హీరోల్లో యంగ్ గాయ్ నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఫలితంగా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వినాయక చవితి రోజు వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 19 రోజుల్లో ఎంత వసూళు చేసిందో మీరే చూడండి!

కార్తికేయగా హీరో నిఖిల్ విశ్వరూపం

కార్తికేయగా హీరో నిఖిల్ విశ్వరూపం

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా - చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'కార్తికేయ 2'. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో విడుదల అయింది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

19వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

19వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

19వ రోజు 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 96 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

19 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

19 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


'కార్తికేయ 2' మూవీకి 19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.23 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.57 కోట్లు, గుంటూరులో రూ. 2.60 కోట్లు, కృష్ణాలో రూ. 2.12 కోట్లు, నెల్లూరులో రూ. 1.04 కోట్లతో.. రూ. 31.18 కోట్లు షేర్, రూ. 52.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో రూ. 31.18 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.75 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 12.65 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 19 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.30 కోట్లు షేర్‌, రూ. 105.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే


నిఖిల్ - అనపమ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లో దీనికి రూ. 52.30 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 39.00 కోట్ల లాభాలు సొంతం అయ్యాయి.

మళ్లీ డబుల్.. 1 కోటి వస్తే చరిత్రే

మళ్లీ డబుల్.. 1 కోటి వస్తే చరిత్రే

యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ భారీ స్పందన దక్కుతోంది. ఈ క్రమంలోనే 19వ రోజు దీనికి వసూళ్లు మూడింతలు పెరిగాయి. దీంతో ఇది చాలా రికార్డులకు చేరువైంది. ఈ సినిమాకు ఇంకో రూ. 1 కోటి షేర్ వస్తే.. ఏకంగా రూ. 40 కోట్లు లాభాలను అందుకున్న చిత్రంగా 'కార్తికేయ 2' చరిత్ర సృష్టిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X