For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 1st Week Collections: 13 కోట్ల బిజినెస్.. వారంలోనే అన్ని కోట్లు.. తొలి మూవీగా రికార్డు

    |

    సోలో హీరోగా మారినప్పటి నుంచి తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నిఖిల్ సిద్దార్థ్. దీంతో విభిన్నమైన చిత్రాలు చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు వస్తున్నాడు. ఇలా ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు రెండేళ్లకు పైగానే వెండితెరకు దూరంగా ఉన్న నిఖిల్.. ఇటీవలే 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    గతంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'కార్తికేయ'కు ఇది సీక్వెల్‌గా వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' వారం రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ లుక్కేయండి!

    కార్తికేయ 2తో వచ్చిన నిఖిల్ సిద్దార్థ్

    కార్తికేయ 2తో వచ్చిన నిఖిల్ సిద్దార్థ్

    నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కలిసి చేసిన సినిమానే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.

    హాట్ షోలో హద్దు దాటిన బిగ్ బాస్ లహరి: స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల ఆరబోత

     కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


    నిఖిల్ మార్కెట్, అంచనాలకు అనుగుణంగా 'కార్తికేయ 2' బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

    7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


    'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజూ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 2.03 కోట్లు షేర్, రూ. 3.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    షార్ట్ డ్రెస్‌లో హాట్‌గా అనుష్క శర్మ: కోహ్లీ భార్య ఫోజులు చూశారంటే!

    7 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    7 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


    నిఖిల్ చేసిన 'కార్తికేయ 2' మూవీకి వారం రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.54 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.03 కోట్లు, గుంటూరులో రూ. 1.65 కోట్లు, కృష్ణాలో రూ. 1.36 కోట్లు, నెల్లూరులో రూ. 59 లక్షలతో.. రూ. 18.69 కోట్లు షేర్, రూ. 29.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో వారంలో రూ. 18.69 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఇది కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.64 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.25 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 28.03 కోట్లు షేర్‌, రూ. 50.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

    శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!

    టార్గెట్ ఎంత... లాభం ఎంత?

    టార్గెట్ ఎంత... లాభం ఎంత?


    నిఖిల్ - చందూ మొండేటి కాంబోలో రూపొందిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 28.03 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 14.73 కోట్ల లాభం వచ్చింది.

    వారంలోనే ఎన్నో రికార్డులతో

    వారంలోనే ఎన్నో రికార్డులతో


    నిఖిల్ హీరోగా చేసిన 'కార్తికేయ 2' సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఏడో రోజు దీనికి కలెక్షన్లు డబుల్ అయ్యాయి. తద్వారా ఏపీ, తెలంగాణలో ఎక్కువ వసూలు చేసిన చిత్రాల్లో ఇది నాలుగో స్థానానికి చేరింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం వారంలోనే బిజినెస్‌కు డబుల్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును కొట్టింది.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 28.03 Cr in 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X