twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Karthikeya 2 2 Weeks Collections: 13 కోట్ల బిజినెస్.. 2 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభాలతో రికార్డు

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చిన్న వయసులోనే అదిరిపోయే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నిఖిల్ సిద్దార్థ్. ఆరంభంలోనే హీరోగా పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే నిఖిల్ ఇటీవలే 'కార్తికేయ 2' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 2 వారాల్లో బాక్సాఫీస్ రిపోర్టును మీరు చూడండి!

కార్తికేయగా ఎంటరైన నిఖిల్ సిద్దార్థ్

కార్తికేయగా ఎంటరైన నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

హీరోయిన్ ప్రణిత అందాల ఆరబోత: డెలివరీ తర్వాత హాట్ షోతో అరాచకం
హీరోయిన్ ప్రణిత అందాల ఆరబోత: డెలివరీ తర్వాత హాట్ షోతో అరాచకం

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

నిఖిల్ మార్కెట్‌‌కు అనుగుణంగానే 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'కార్తికేయ 2' సినిమాకు 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 51 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

హాట్ షోలో హద్దు దాటిన జాన్వీ కపూర్: శ్రీదేవి కూతురా మజాకానా!
హాట్ షోలో హద్దు దాటిన జాన్వీ కపూర్: శ్రీదేవి కూతురా మజాకానా!

2 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

2 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి 2 వారాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.72 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.15 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, గుంటూరులో రూ. 2.29 కోట్లు, కృష్ణాలో రూ. 1.86 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో.. రూ. 26.57 కోట్లు షేర్, రూ. 44.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

క్రేజీ కాంబోలో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో రూ. 26.57 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఇది కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.95 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 9.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.65 కోట్లు షేర్‌, రూ. 85.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన నిహారిక: తొలిసారి మెగా డాటర్ హాట్ ట్రీట్
టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన నిహారిక: తొలిసారి మెగా డాటర్ హాట్ ట్రీట్

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 43.65 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 30.35 కోట్ల లాభం వచ్చింది.

లాభాలతోనే సంచలన రికార్డుతో

లాభాలతోనే సంచలన రికార్డుతో

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇది సత్తా చాటుతోంది. దీంతో ఇప్పటికే ఈ చిత్రానికి రూ. 43.65 కోట్లు వసూలు అయ్యాయి. ఫలితంగా ఈ సినిమాకు అప్పుడే రూ. 30 కోట్లకు పైగా లాభాలు దక్కాయి. దీంతో ఈ చిత్రం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.

English summary
Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 43.65 Cr in 2 Weeks.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X