twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 Collections: కార్తికేయకు తొలి షాక్.. 20 రోజుల్లో చాలా తక్కువగా.. లాభాలు చూస్తే మాత్రం!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను తెలుగు వాళ్లకు పరిచయం చేసిన ఈ కుర్రాడు.. తనదైన చిత్రాలతో సందడి చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఫలితంగా ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి సినీ ప్రియులంతా అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 20 రోజుల్లో ఎంత వసూళు చేసిందో చూద్దాం పదండి!

    కార్తికేయగా హీరో నిఖిల్ విశ్వరూపం

    కార్తికేయగా హీరో నిఖిల్ విశ్వరూపం

    నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో రిలీజైంది.

    HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

    20వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    20వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'కార్తికేయ 2' సినిమాకు 20వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 27 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్

    20 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    20 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    'కార్తికేయ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.58 కోట్లు, గుంటూరులో రూ. 2.62 కోట్లు, కృష్ణాలో రూ. 2.14 కోట్లు, నెల్లూరులో రూ. 1.05 కోట్లతో.. రూ. 31.45 కోట్లు షేర్, రూ. 52.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    డివోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో రూ. 31.45 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.78 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 12.95 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 20 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.93 కోట్లు షేర్‌, రూ. 106.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    నిఖిల్ - అనపమ కలయికలో రూపొందిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లో దీనికి రూ. 52.93 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 39.63 కోట్ల లాభాలు సొంతం అయ్యాయి.

     ఫుల్ రన్‌తో తొలిసారి తక్కువగా

    ఫుల్ రన్‌తో తొలిసారి తక్కువగా

    యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతూనే వచ్చాయి. అయితే, 20వ రోజు మాత్రం దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 17 లక్షలు, ఓవరాల్‌గా రూ. 63 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. అంటే.. 20 రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన తక్కువ వసూళ్లు ఇవే.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 52.93 Cr in 20 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X