For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 Collections: కార్తికేయ మరో సంచలన రికార్డు.. ప్రభాస్, మహేశ్, పవన్ తర్వాత నిఖిల్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో యంగ్ స్టార్ నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచి తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దీంతో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

    ఈ ఉత్సాహంతోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి సినీ ప్రియులంతా అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 22 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం

    కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం

    నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'కార్తికేయ 2'. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం హిందీలో కూడా విడుదలైంది.

    యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షో

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

    22వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    22వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'కార్తికేయ 2' సినిమాకు 22వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 20 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

    22 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    22 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    'కార్తికేయ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 22 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.51 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు, గుంటూరులో రూ. 2.65 కోట్లు, కృష్ణాలో రూ. 2.17 కోట్లు, నెల్లూరులో రూ. 1.07 కోట్లతో.. రూ. 31.79 కోట్లు షేర్, రూ. 53.17 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    డివోషనల్ సబ్జెక్టుతో రూపొందిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 22 రోజుల్లో రూ. 31.79 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.25 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 13.50 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 22 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 54.34 కోట్లు షేర్‌, రూ. 109.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

    JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    నిఖిల్ - అనపమ హీరో హీరోయిన్లుగా చేసిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లో దీనికి రూ. 54.34 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 41.04 కోట్ల లాభాలు సొంతం అయ్యాయి.

     టాలీవుడ్‌లో టాప్ 5కు చేరిందిగా

    టాలీవుడ్‌లో టాప్ 5కు చేరిందిగా

    చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ భారీ స్పందన దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా తాజాగా 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. దీంతో ఈ ఏడాది RRR, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ తర్వాతి స్థానానికి చేరుకుంది.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 54.34 Cr in 22 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X