Karthikeya 2 Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. సండే అన్ని లక్షలు.. కోట్ల లాభాలతో రికార్డు

టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో సందడి చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేసిన అతడు.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

తద్వారా మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిఖిల్ ఇటీవలే 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 23 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

కార్తికేయ 2తో వచ్చిన హీరో నిఖిల్

కార్తికేయ 2తో వచ్చిన హీరో నిఖిల్

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి రూపొందించిన చిత్రమే 'కార్తికేయ 2'. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం హిందీలో కూడా రిలీజ్ అయింది.

 కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

23వ రోజు 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 28 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' మూవీకి 23 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.54 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.62 కోట్లు, గుంటూరులో రూ. 2.68 కోట్లు, కృష్ణాలో రూ. 2.20 కోట్లు, నెల్లూరులో రూ. 1.08 కోట్లతో.. రూ. 32.07 కోట్లు షేర్, రూ. 53.62 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

భక్తరస చిత్రంగా రూపొందిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో రూ. 32.07 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.28 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 13.75 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 23 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 54.92 కోట్లు షేర్‌, రూ. 110.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

నిఖిల్ - అనపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లో దీనికి రూ. 54.92 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 41.62 కోట్ల లాభాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X