Karthikeya 2 Collections: హెచ్చుతగ్గులతో కార్తికేయ 2 కలెక్షన్లు!.. ఎలా ఉన్నాయంటే?

టాలీవుడ్ యంగ్​ హీరో నిఖిల్​ సిద్ధార్థ్​, బ్యూటిఫుల్​ హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్​ జోడిగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి డైరెక్షన్​లో 2014లో నిఖిల్​ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 వస్తుందని ప్రకటన రాగానే కొద్దిపాటి క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది కార్తికేయ 2 చిత్రం. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ 24 రోజుల కలెక్షన్స్​ ఎలా ఉన్నాయో చూద్దామా!

డైరెక్టర్​ చందూ మొండేటి-నిఖిల్ సిద్ధార్థ్​ కాంబినేషన్​లో రెండోసారి తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీని బాలీవుడ్​లో హిట్​ కొట్టిన ది కశ్మీర్ ఫైల్స్​ మూవీకి ఒక నిర్మాత అయిన అభిషేక్​ అగర్వాల్​తోపాటు టీజీ విశ్వ ప్రసాద్​ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్​ ప్రముఖ నటుడు అనుపమ్​ ఖేర్​ ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.

 కార్తికేయ 2 బిజినెస్​ వివరాలు

కార్తికేయ 2 బిజినెస్​ వివరాలు

సుమారు 10 ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తున్న యంగ్​ హీరో నిఖిల్​ కార్తికేయ 2 మూవీకి మంచి బిజినెస్​ జరిగింది. కార్తికేయ 2 నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్​లో రూ. 1.80 కోట్లు జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​లో రూ. 6 కోట్లు, తెలంగాణలో రూ. 11.30 కోట్ల బిజినెస్​ కాగా, రెస్టాఫ్​ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్​లో రూ. 1 కోటితో కలిపి మొత్తం రూ. 12.80 కోట్ల బిజినెస్​ను సాధించింది.

24వ రోజు వచ్చిన కలెక్షన్లు..

24వ రోజు వచ్చిన కలెక్షన్లు..

24వ రోజు 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 13 లక్షలు షేర్, రూ. 23 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

24 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

24 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' మూవీకి 24 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.55 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.63 కోట్లు, గుంటూరులో రూ. 2.69 కోట్లు, కృష్ణాలో రూ. 2.21 కోట్లు, నెల్లూరులో రూ. 1.09 కోట్లతో.. రూ. 32.20 కోట్లు షేర్, రూ. 53.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

వరల్డ్​వైడ్​గా వసూళ్లు ఇలా..

అనుపమ, నిఖిల్​ జోడి కట్టిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో రూ. 32.20 కోట్ల షేర్ కలెక్ట్​ చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.83 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.35 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 13.95 కోట్లు వసూలు చేసింది. వీటన్నింటితో కలుపుకుంటే 24 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.33 కోట్లు షేర్‌, రూ. 111.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

టార్గెట్​కు వచ్చిన లాభం ఎంతంటే?

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు మించి వరల్డ్​ వైడ్​గా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 24 రోజుల్లో కార్తికేయ 2 చిత్రానికి రూ. 55.33 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 42.03 కోట్ల లాభం వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X