twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 Collections: 25 రోజుల్లోనే అన్ని కోట్లు.. చరిత్ర సృష్టించిన కార్తికేయ లాభాలు

    |

    ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీలను మాత్రమే చేసిన అతడు.. ఆ తర్వాత పంథాను మార్చుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా విభిన్నమైన సినిమాలనే చేస్తూ వచ్చాడు. దీంతో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో కూడా వేసుకున్నాడు.

    ఈ క్రమంలోనే ఇటీవల అతడు 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

     కార్తికేయ 2తో హీరో నిఖిల్ సందడి

    కార్తికేయ 2తో హీరో నిఖిల్ సందడి

    నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కలయికలో రూపొందిన చిత్రమే 'కార్తికేయ 2'. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చింది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

     కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    'కార్తికేయ' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'కార్తికేయ 2'కి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ చేసింది.

    25వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    25వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అలా ఈ చిత్రం దాదాపు మూడు వారాల పాటు హవాను చూపించింది. అయితే, కొన్ని రోజులుగా దీనికి కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 25వ రోజైన మంగళవారం 'కార్తికేయ 2' మూవీకి కేవలం రూ. 9 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

    ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!

    25 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    25 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.39 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.63 కోట్లు, గుంటూరులో రూ. 2.70 కోట్లు, కృష్ణాలో రూ. 2.22 కోట్లు, నెల్లూరులో రూ. 1.09 కోట్లతో.. రూ. 32.29 కోట్లు షేర్, రూ. 54.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో రూ. 32.29 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.37 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 14.20 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 25 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.71 కోట్లు షేర్‌, రూ. 112.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    Bigg Boss Telugu 6: బయటపడిన బిగ్ బాస్ భారీ మోసం.. వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో విమర్శలుBigg Boss Telugu 6: బయటపడిన బిగ్ బాస్ భారీ మోసం.. వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో విమర్శలు

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    నిఖిల్ - అనపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 25 రోజుల్లో దీనికి రూ. 55.71 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 42.41 కోట్ల లాభాలు వచ్చాయి.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 55.71 Cr in 25 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X