Karthikeya 2 Collections: కార్తికేయకు బిగ్ షాక్.. 26వ రోజు ఘోరంగా.. ఆ విషయంలో సంచలనమే

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. క్రమంగా మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోన్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటేందుకు 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే అంచనాలను భారీగా ఏర్పరచుకున్న ఈ మూవీ.. అదిరిపోయే కలెక్షన్లను సాధించింది. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 26 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో ఓ లుక్కేద్దాం పదండి!

డివోషనల్ కాన్సెప్టుతో ‘కార్తికేయ 2'

డివోషనల్ కాన్సెప్టుతో ‘కార్తికేయ 2'

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'కార్తికేయ 2'. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

సూపర్ హిట్ సినిమాను సీక్వెల్‌గా వచ్చిన 'కార్తికేయ 2'కి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ చేసుకుంది.

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'కార్తికేయ' వంటి సూపర్ హిట్ తర్వాత నిఖిల్ - చందూ మొండేటి కలయికలో వచ్చిన 'కార్తికేయ 2' అంచనాలకు అనుగుణంగానే అదిరిపోయే స్పందనను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే, క్రమంగా తగ్గుతూ 26వ రోజైన బుధవారం 'కార్తికేయ 2' మూవీకి కేవలం రూ. 6 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

26 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

26 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' మూవీకి 26 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.63 కోట్లు, గుంటూరులో రూ. 2.71 కోట్లు, కృష్ణాలో రూ. 2.23 కోట్లు, నెల్లూరులో రూ. 1.09 కోట్లతో.. రూ. 32.35 కోట్లు షేర్, రూ. 54.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

విభిన్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 26 రోజుల్లో రూ. 32.35 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.40 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 14.40 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 26 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 56.00 కోట్లు షేర్‌, రూ. 113.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

నిఖిల్ సిద్దార్థ్ - అనపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లో దీనికి రూ. 56.00 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 42.70 కోట్ల లాభాలు వచ్చాయి.

బిగ్ షాక్.. అందులో మాత్రం సత్తా

బిగ్ షాక్.. అందులో మాత్రం సత్తా

హిట్ కాంబినేషన్‌లో రూపొందిన 'కార్తికేయ 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 26వ రోజు ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే, లాభాల విషయంలో మాత్రం ఇది సంచలనం సృష్టిస్తూనే ఉంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X