For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 Collections: 13 కోట్ల టార్గెట్.. 3 వారాల్లో సంచలనం.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు

    |

    టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని, వినూత్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోన్నాడు నిఖిల్ సిద్దార్థ్. దీంతో క్రమంగా నటుడిగా పరిణితిని పొందడంతో పాటు విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తోన్నాడు. దీంతో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు.

    ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి సినీ ప్రియులంతా మంచి స్పందనను అందించారు. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 3 వారాల్లో ఎంత వసూళు చేసిందో మీరే చూడండి!

    కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం

    కార్తికేయగా హీరో నిఖిల్ అరాచకం

    నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన సినిమానే 'కార్తికేయ 2'. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం నాలుగు భాషల్లో విడుదలైంది.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

    21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    21వ రోజు 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

    3 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

    3 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

    'కార్తికేయ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.49 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.59 కోట్లు, గుంటూరులో రూ. 2.63 కోట్లు, కృష్ణాలో రూ. 2.15 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్లతో.. రూ. 31.59 కోట్లు షేర్, రూ. 52.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

     ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో రూ. 31.59 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.77 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.90 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 13.20 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే 21 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.46 కోట్లు షేర్‌, రూ. 107.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

    బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

     టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

    నిఖిల్ - అనపమ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లో దీనికి రూ. 53.46 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 40.16 కోట్ల లాభాలు సొంతం అయ్యాయి.

    మరో సంచలన రికార్డు నమోదు

    మరో సంచలన రికార్డు నమోదు

    చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతూనే వచ్చాయి. దీంతో లాభాల పరంగా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రూ. 40 కోట్ల లాభాలను అందుకుని మరో రికార్డును చేరుకుంది.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 53.46 Cr in 3 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X