For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 4 Days Collections: కార్తికేయ సంచలనం.. టాప్ మూవీగా రికార్డు.. అప్పుడే అన్ని కోట్ల లాభం

    |

    బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా దూసుకుపోతోన్నాడు నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి వరుస సినిమాలతో సందడి చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 4 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

    కార్తికేయకు సీక్వెల్‌గా కార్తికేయ 2

    కార్తికేయకు సీక్వెల్‌గా కార్తికేయ 2

    నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీనే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

    నిధి అగర్వాల్ అందాల ఆరబోత: అబ్బో ఇది మామూలు షో కాదుగా!

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

    కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


    నిఖిల్ మార్కెట్‌‌తో పాటు 'కార్తికేయ 2' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజూ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 94 లక్షలు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 2.17 కోట్లు షేర్, రూ. 3.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    స్లీవ్‌లెస్ టాప్‌లో రాశీ ఖన్నా హాట్ షో: ఆమెనిలా చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

    4 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    4 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    నిఖిల్ 'కార్తికేయ 2' మూవీకి నాలుగు రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.79 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.16 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, గుంటూరులో రూ. 1.30 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 47 లక్షలతో.. రూ. 13.71 కోట్లు షేర్, రూ. 31.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రూ. 13.71 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.51 కోట్లు షేర్‌, రూ. 32.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

    శృతి మించిన తెలుగు పిల్ల హాట్ ట్రీట్: ఖిలాడి మూవీలో కంటే దారుణంగా!

    టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

    టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

    చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 18.51 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.21 కోట్ల లాభం వచ్చింది.

    నిఖిల్ కెరీర్‌లోనే టాప్ మూవీగా

    నిఖిల్ కెరీర్‌లోనే టాప్ మూవీగా

    క్రేజీ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన 'కార్తికేయ 2' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 18.51 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. తద్వారా 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' పేరిట ఉన్న రూ. 16.55 కోట్ల రికార్డును ఇది చెరిపేసింది.

    English summary
    Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 18.51 Cr in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X