Karthikeya 2 5 Days Collections: 5వ రోజూ అన్ని కోట్లు.. అక్కడ రికార్డులతో.. లాభమే అన్ని కోట్లు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. అందుకే బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీనికితోడు విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఫలితంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 5 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

కార్తికేయ 2తో వచ్చిన నిఖిల్ సిద్దార్థ్

కార్తికేయ 2తో వచ్చిన నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కలయికలో వచ్చిన సినిమానే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజైంది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

నిఖిల్ మార్కెట్‌‌కు అనుగుణంగానే 'కార్తికేయ 2' మూవీ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజూ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 1.61 కోట్లు షేర్, రూ. 2.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి 5 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.03 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.41 కోట్లు, కృష్ణాలో రూ. 1.11 కోట్లు, నెల్లూరులో రూ. 50 లక్షలతో.. రూ. 15.32 కోట్లు షేర్, రూ. 34.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

క్రేజీ కాంబోలో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 15.32 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.75 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.50 కోట్లు షేర్‌, రూ. 37.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

నిఖిల్ హీరోగా చందూ మొండెటీ తెరకెక్కించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 21.50 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.20 కోట్ల లాభం వచ్చింది.

5వ రోజు అక్కడ రికార్డు స్థాయిలో

5వ రోజు అక్కడ రికార్డు స్థాయిలో

అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'కార్తికేయ 2' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి 5వ రోజు నార్త్ ఇండియాలో ఏకంగా రూ. 1.00 షేర్ వచ్చింది. ఇది ఒక రకంగా రికార్డు అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X