Karthikeya 2 6 Days Collections: ఆరో రోజూ అదే కుమ్ముడు.. అప్పుడే అన్ని కోట్లు.. ఇండియాలో సంచలనం

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే తన టాలెంట్లను నిరూపించుకుంటూ సత్తా చాటుతోన్న అతడు.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిఖిల్ ఇటీవలే 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

కార్తికేయ 2తో నిఖిల్ సిద్దార్థ్ ఎంట్రీ

కార్తికేయ 2తో నిఖిల్ సిద్దార్థ్ ఎంట్రీ

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి రూపొందించిన చిత్రమే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


నిఖిల్ మార్కెట్, నెలకొన్న అంచనాల వల్ల 'కార్తికేయ 2' మూవీ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజూ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 54 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 1.34 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి 6 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 94 లక్షలు, గుంటూరులో రూ. 1.51 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 53 లక్షలతో.. రూ. 16.66 కోట్లు షేర్, రూ. 36.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

డివోషనల్ స్టోరీతో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రూ. 16.66 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.90 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.66 కోట్లు షేర్‌, రూ. 42.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

టార్గెట్ ఎంత.. లాభం ఎంత?

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 23.66 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.36 కోట్ల లాభం వచ్చింది.

ఇండియాలోనే సంచలనంగా

ఇండియాలోనే సంచలనంగా

నిఖిల్ - స్వాతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ అయిన 'కార్తికేయ'కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే 'కార్తికేయ 2'. ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో రోజురోజుకూ స్క్రీన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా గతంలో ఏ సినిమా ప్రభావాన్ని చూపలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X