Karthikeya 2 8 Days Collections: కుమ్మేసిన కార్తికేయ.. 8 రోజుల్లోనే అన్ని కోట్లు.. సీతా రామం ఔట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్. సోలో హీరోగా మారినప్పటి నుంచి విలక్షణమైన నటనతో విభిన్నమైన చిత్రాలను చేస్తూ తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. అదే సమయంలో హిట్లు ఫ్లాపులను బేరీజు వేసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే నిఖిల్ ఇటీవలే 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో కలెక్షన్ల సునామీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరు కూడా చూసేయండి!

మరోసారి కార్తికేయగా మారిన హీరో
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి రూపొందించిన చిత్రమే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చింది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్
యంగ్ హీరో నిఖిల్ మార్కెట్‌కు అనుగుణంగా 'కార్తికేయ 2' బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ చేసుకుంది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజూ రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 61 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.61 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి 8 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.67 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.77 కోట్లు, కృష్ణాలో రూ. 1.47 కోట్లు, నెల్లూరులో రూ. 63 లక్షలతో.. రూ. 20.30 కోట్లు షేర్, రూ. 32.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
క్రేజీ కాంబోలో రూపొందిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో వారంలో రూ. 20.30 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఇది కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.90 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 5.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.65 కోట్లు షేర్, రూ. 58.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంత?
నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 31.65 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.35 కోట్ల లాభం వచ్చింది.

8 రోజుల్లోనే సీతా రామం ఔట్
నిఖిల్ - చందూ మొండేటి కలయికలో రూపొందిన 'కార్తికేయ 2' సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఈ మూవీ 8 రోజుల్లోనే రూ. 31.65 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'సీతా రామం' 16 రోజుల్లో వసూలు చేసిన రూ. 31.05 కోట్లను దాటేసి మరింత స్పీడుగా దూసుకెళ్తోంది.


Click it and Unblock the Notifications











