Karthikeya 2 9 Days Collections: సండే కార్తికేయ సంచలనం.. అప్పుడే అన్ని కోట్లా.. నెంబర్ వన్ మూవీగా!

నిఖిల్ సిద్దార్థ్.. తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా అతడు దాదాపు పదేళ్లుగా తనదైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో విలక్షణమైన నటనతో తనలోని అన్ని కోణాలను చూపిస్తున్నాడు. తద్వారా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నిఖిల్ ఇటీవలే 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ లుక్కేయండి!

మరోసారి కార్తికేయగా నిఖిల్ సిద్దార్థ్

మరోసారి కార్తికేయగా నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కలయికలో రూపొందిన చిత్రమే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


నిఖిల్ మార్కెట్‌కు అనుగుణంగానే 'కార్తికేయ 2' చిత్రానికి బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

9వ రోజూ 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 86 లక్షలు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రూ. 2.42 కోట్లు షేర్, రూ. 4.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి 9 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.24 కోట్లు, గుంటూరులో రూ. 1.97 కోట్లు, కృష్ణాలో రూ. 1.65 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో.. రూ. 22.93 కోట్లు షేర్, రూ. 36.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

హిట్ కాంబోలో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో రూ. 22.93 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఇది కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 7.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.38 కోట్లు షేర్‌, రూ. 68.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంత?

టార్గెట్ ఎంత... లాభం ఎంత?

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ కలయికలో వచ్చిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 36.38 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.08 కోట్ల లాభం వచ్చింది.

టాలీవుడ్‌లో టాప్ మూవీ ఇదే

టాలీవుడ్‌లో టాప్ మూవీ ఇదే

నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' సినిమాకు 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.42 కోట్లు వచ్చాయి. దీంతో 9వ రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన మీడియం రేంజ్ చిత్రాల్లో ఇది టాప్ ప్లేస్‌కు చేరింది. అలాగే, ఎక్కువ లాభాలు అందుకున్న మీడియం రేంజ్ చిత్రాల్లో 'కార్తికేయ 2' 5వ స్థానానికి చేరింది. అంతేకాదు, 9వ రోజు హయ్యస్ట్ షేర్ మూవీస్‌లో 12వ స్థానానికి చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X