Karthikeya 2 Total Collections: చరిత్ర సృష్టించిన నిఖిల్.. అన్ని కోట్ల లాభాలతో సంచలన రికార్డు

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటూ.. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఈ మధ్య కాలంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటోన్నా.. భారీ సక్సెస్ కోసం మాత్రం చాలా కాలంగా వేచి చూస్తోన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డివోషనల్ కాన్సెప్టుతో ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' ఫైనల్ కలెక్షన్లను మీరే చూడండి!

‘కార్తికేయ 2'తో వచ్చేసిన నిఖిల్

‘కార్తికేయ 2'తో వచ్చేసిన నిఖిల్


నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి రూపొందించిన సినిమానే 'కార్తికేయ 2'. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయింది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్


కార్తికేయకు సీక్వెల్‌గా రూపొందిన 'కార్తికేయ 2'కి బిజినెస్ బాగా జరిగింది. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌‌ను జరుపుకుంది.

పాజిటివ్ టాక్... కలెక్షన్ల అరాచకం

పాజిటివ్ టాక్... కలెక్షన్ల అరాచకం


యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన డివోషనల్ మూవీ 'కార్తికేయ 2'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే, హిందీతో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. ఇలా అన్ని ఏరియాల్లో ఇది కలెక్షన్లతో అరాచకం సృష్టించింది.

 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది


తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' మూవీకి ఫుల్ రన్‌లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 13.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.68 కోట్లు, గుంటూరులో రూ. 2.80 కోట్లు, కృష్ణాలో రూ. 2.29 కోట్లు, నెల్లూరులో రూ. 1.12 కోట్లతో.. రూ. 33.35 కోట్లు షేర్, రూ. 56.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ 2'కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో రూ. 33.35 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 15.55 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే మొత్తంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.40 కోట్లు షేర్‌, రూ. 121.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే

టార్గెట్ ఎంత... లాభం ఎంతంటే


నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కాంబోలో రూపొందిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 58.40 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 45.10 కోట్ల లాభాలు వచ్చాయి.

ఓటీటీలోనూ సత్తా చాటుతోందిగా

ఓటీటీలోనూ సత్తా చాటుతోందిగా


నిఖిల్ సిద్ధార్థ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' మూవీ హిందీలోనూ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. మొత్తంగా థియేటర్లలో ఓ రేంజ్‌లో వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. స్ట్రీమింగ్ ఇటీవలే ZEE5లో ప్రారంభం అయింది. అందులో కూడా ఈ చిత్రానికి భారీ స్పందన దక్కుతోంది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X