Karthikeya 2 Day 1 Collections: మొదటి రోజే అన్ని కోట్లతో సంచలనం.. టాప్ మూవీగా రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే 'అర్జున్ సురవరం'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'కార్తికేయ 2' అనే సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఫలితంగా తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'కార్తికేయ 2' బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

హిట్ మూవీకి సీక్వెల్‌గా కార్తికేయ 2

హిట్ మూవీకి సీక్వెల్‌గా కార్తికేయ 2


నిఖిల్ సిద్దార్థ్ - చందూ మొండేటి కలయికలో వచ్చిన థ్రిల్లర్ మూవీనే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కాల భైరవ సంగీతం అందించాడు. ఇందులో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది.

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

కార్తికేయ 2 మూవీ బిజినెస్ డీటేల్స్

నిఖిల్ మార్కెట్‌కు తోడు 'కార్తికేయ 2' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

అలాంటి టాక్.. వసూళ్లు భారీగానే

అలాంటి టాక్.. వసూళ్లు భారీగానే

భారీ అంచనాల నడుమ రూపొందిన థ్రిల్లర్ మూవీ 'కార్తికేయ 2' శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయేలా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో.. రూ. 3.50 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 3.50 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.05 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 5.05 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

నిఖిల్ కెరీర్‌లోనే టాప్ మూవీగా

నిఖిల్ కెరీర్‌లోనే టాప్ మూవీగా

ఎన్నో సార్లు వాయిదా పడి శనివారమే విడుదలైన 'కార్తికేయ 2' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు కిర్రాక్ పార్టీ రూ. 1.65 కోట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉండేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X