twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 Pre Release Bussiness: నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ టార్గెట్.. ఎంత వస్తే హిట్ అంటే..?

    |

    యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన సీక్వెల్ కార్తికేయ 2 ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మిగతా సినిమాల నుంచి పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కార్తికేయ సినిమాకు ఉన్న డిమాండ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇక ఈ సినిమా థియేట్రికల్ గా కూడా మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. కార్తికేయ 2 తెలుగు హిందీ తమిళ్ మలయాళంలో తెరకెక్కగా తెలుగు హిందీలో మలయాళంలో థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ 2 ఎంత బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

    బాక్సాఫీస్ పోటీ

    బాక్సాఫీస్ పోటీ

    నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను గత నెల రోజుల నుంచి వాయిదా పడుతూ మొత్తానికి ఆగస్టు 13వ తేదీన విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమాకు పోటీగా లాల్ సింగ్ చడ్డాతో పాటు నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా అంతకుముందే విడుదల అవుతున్నాయి. కాబట్టి టాక్ బలంగా పాజిటివ్ గా రావాల్సి ఉంటుంది.

    మార్కెట్ లో మంచి డిమాండ్

    మార్కెట్ లో మంచి డిమాండ్

    నిఖిల్ మాత్రం ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుంది అని ప్రతి ప్రమోషన్ లో నమ్మకంగా చెబుతున్నాడు. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.

     తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్

    కార్తికేయ 2 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో చేసిన బిజినెస్ వివరాల్లోకి వెళితే నైజంలో ఈ సినిమా రూ.4 కు అమ్ముడైనట్లు సమాచారం. ఇక సీడెడ్ లో 2 కోట్ల ధర పలికిన ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 6 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే కార్తికేయ 2 రూ.12 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

    తెలుగులో ఎంత రావాలి.

    తెలుగులో ఎంత రావాలి.

    కర్ణాటకలో కూడా ఈ సినిమాకు కొంత హైప్ క్రియేట్ అయింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక మొత్తంగా కలుపుకుని 80 లక్షల వరకు బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో 1.40 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ విదంగా తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఓవర్సీస్ చూసుకుంటే టోటల్ గా కార్తికేయ 2 సినిమా 14.20 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగులో సక్సెస్ కావాలి అంటే 15 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది.

     వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంతంటే..

    వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంతంటే..

    మిస్టరీ అడ్వెంచర్ గా రూపొందిన కార్తికేయ 2 ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పటికే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నట్లు సమాచారం. హిందీలో అలాగే మిగతా భాషల్లో సినిమా మూడు కోట్ల ధర పలికింది. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 17.20 కోట్ల వరకు బిజినెస్ చేసిన కార్తికేయ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవుతోంది. మరి ఈ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారో చూడాలి.

    English summary
    Nikhil Siddharth Karthikeya 2 movie worldwide Pre Release Bussiness
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X