రికార్డు ధరకు కార్తికేయ 2 నాన్ థియేట్రికల్ రైట్స్.. అందుకే ఆ రేంజ్ ఆఫర్?

యంగ్ హీరో నిఖిల్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ చేస్తున్న కార్తికేయ 2 గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఇప్పటికే ఈ ఒప్పందం కూడా పూర్తయిందని అంటున్నారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

హ్యాపీడేస్ సినిమాతో

హ్యాపీడేస్ సినిమాతో

సంబరం అనే సినిమాతో ఎంట్రీ ఇఛ్చి హ్యాపీడేస్ సినిమాతో నిఖిల్ ఫేమస్ అయ్యాడు. హ్యాపీడేస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న నిఖిల్ ఈ మధ్య వరుస ఫ్లాప్ లు అందుకున్న పరిస్థితి. అయితే హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నిఖిల్ చివరిగా అర్జున్ సురవరం సినీరంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు

ఇప్పుడు ఆయన చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిన క్రమంలో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని తెరకెక్కించిన చందు మొండేటి దర్శకత్వంలో ఈ రెండో భాగం కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు వచ్చేసింది.

 ఫ్యాన్సీ ధర

ఫ్యాన్సీ ధర

పీపుల్ మీడియా ఫ్యాక్టరి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగా జరిగిందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ధర పలికినట్లు సమాచారం.

మే నెలలో

మే నెలలో

తాజా సమాచారం మేరకు జీ స్టూడియోస్ "కార్తికేయ 2" అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులు సుమారు 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని అంటున్నారు. ఇప్పటికే ఈ ఒప్పందం కూడా పూర్తయిందని అంటున్నారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 ఆల్ టైం రికార్డ్

ఆల్ టైం రికార్డ్

నిజానికి ఈ రేంజ్ రేటు సొంతం చేసుకోవడం స్టార్ హీరోల సినిమాలకే సాధ్యం అవుతూ ఉంటుంది. కానీ కార్తికేయ2 పై అంచనాలు కూడా బాగానే ఉండటంతో పాటు రషెష్ చూసిన తరువాత జీ సంస్థ ఈ భారీ రేట్ తో కొనుగోలు చేసిందని అంటున్నారు. ఇక ఈ రేటు నిఖిల్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ గా చెప్పుకోవచ్చు. చూడాలి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

 18 పేజెస్ మూవీ కూడా..

18 పేజెస్ మూవీ కూడా..

మరో విషయం ఏమిటంటే కార్తికేయ 2లో కార్తికేయ మూవీలో హీరోయిన్‌గా నటించిన కలర్స్ స్వాతి కీలకపాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాతోపాటు సుకుమార్ రైటింగ్స్‌లో నిఖిల్ 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X