SPY Day 1 Collections: నిఖిల్ మూవీకి ఊహించని వసూళ్లు.. తొలి రోజే అంతా.. ఆ మూవీ రికార్డు బద్దలు

విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు.

అయితే, ఇటీవలి కాలంలో హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే నిఖిల్ తాజాగా 'స్పై' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఫస్ట్ డే మాత్రం భారీ స్పందనే వచ్చింది. మరి నిఖిల్ మూవీ తొలి రోజు ఎంత రాబట్టొచ్చొ చూద్దాం పదండి!

 Nikhil Siddharth SPY Movie Day 1 Expected Worldwide Box Office Collections

'స్పై'గా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్: టాలెంటెడ్ గాయ్ నిఖిల్ సిద్దార్థ్ హీరోగా గ్యారీ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీనే 'స్పై'. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు.

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్: నిఖిల్ 'స్పై' మూవీ నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, తమిళం, కన్నడం, మలయాళం వెర్షన్లకు రూ. 2 కోట్లతో కలిపి రూ. 17.50 కోట్ల బిజినెస్ చేసింది.

 Nikhil Siddharth SPY Movie Day 1 Expected Worldwide Box Office Collections

అలాంటి టాక్... వసూళ్లు ఇలా: ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'స్పై' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. అయినప్పటికీ హాలీవడే కావడంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.

 Nikhil Siddharth SPY Movie Day 1 Expected Worldwide Box Office Collections

తొలి రోజు తెలుగులో వసూళ్లు: యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'స్పై' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్‌తో సంబంధం లేకుండానే రెస్పాన్స్ భారీగా లభించింది. పండుగ సెలవు కావడంతో మ్యాట్నీ నుంచి ఈ చిత్రానికి బుకింగ్స్ పెరిగాయి. దీంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ. 2.20 - 2.40 కోట్లు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఆ భాషల్లో మాత్రం తక్కువగా: నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు మంచి వసూళ్లే వస్తాయని చెబుతున్నా.. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో మాత్రం ఇది ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేయట్లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆయా భాషల్లో ఈ సినిమాకు మొదటి రోజు కేవలం రూ. 50 - 60 లక్షలు షేర్ రావొచ్చని అక్కడి బాక్సాఫీస్ సంస్థలు తెలిపాయి.

 Nikhil Siddharth SPY Movie Day 1 Expected Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో మాత్రం రికార్డులే: నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' మూవీకి ఓవర్సీస్‌లో మాత్రం భారీ స్పందన వస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే అక్కడ ఈ చిత్రం 150K డాలర్లను రాబట్టింది. అలాగే, ఫస్ట్ డే కూడా మంచి వసూళ్లలనే కలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఇలా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే 250K డాలర్లను రాబట్టే ఛాన్స్ ఉందట. అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ. 2.05 కోట్ల గ్రాస్ రావొచ్చు.

ఆ సినిమా రికార్డు బ్రేక్ ఖాయం: 'స్పై' చిత్రానికి ఫస్ట్ డే మార్నింగ్, మ్యాట్నీ షోలతో పాటు ఫస్ట్ షో, సెకెండ్ షో అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే.. ఓవరాల్‌గా మంచి స్పందనే దక్కేలా ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.80 - 4.20 కోట్లు వరకూ షేర్ రాబట్టవచ్చని అంటున్నారు. అదే జరిగితే నిఖిల్ '18 పేజెస్' రికార్డు బద్దలు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X