SPY 1st Week Collections: 16.50 కోట్ల టార్గెట్.. వారంలో షాకింగ్‌గా.. నిఖిల్‌కు అన్ని కోట్ల నష్టాలు!

చాలా కాలం పాటు హీరోగా ఎన్నో కష్టాలను అనుభవించినా.. ఈ మధ్య కాలంలో మాత్రం ఏకధాటిగా హిట్లు మీద హిట్లు కొడుతూ భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇలా ఇటీవలే నిఖిల్ 'స్పై' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. అయితే, ఆరంభంలోనే దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ఇది నష్టాల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిఖిల్ 'స్పై' 7 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

స్పైగా నిఖిల్ సిద్దార్థ్ ఎంటర్:నిఖిల్ సిద్దార్థ్ హీరోగా గ్యారీ తెరకెక్కించిన యాక్షన్ సినిమానే 'స్పై'. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Nikhil Siddharth Starrer SPY Movie 1st Week Official Worldwide Box Office Collections

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్:నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు మేర బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 15.50 కోట్ల బిజినెస్ చేసింది.

7వ రోజు తెలుగులో ఎంతంటే?:మిస్టీరియస్ స్టోరీతో రూపొందిన 'స్పై' మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఓపెనింగ్ భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే ఈ చిత్రం డౌన్ అవుతూ వస్తోంది. దీంతో క్రమంగా వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 7వ రోజైన బుధవారం నిఖిల్ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8 లక్షలు షేర్ మాత్రమే లభించింది.

Nikhil Siddharth Starrer SPY Movie 1st Week Official Worldwide Box Office Collections

7వ రోజులకు కలిపితే ఎంత?:'స్పై' మూవీకి 7 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో తక్కువ రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో.. రూ. 7.51 కోట్లు షేర్, రూ. 12.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా:యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 7.51 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.78 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.54 కోట్లు షేర్‌తో పాటు రూ. 17.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nikhil Siddharth Starrer SPY Movie 1st Week Official Worldwide Box Office Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?:నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'స్పై' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 10.54 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.96 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Nikhil Siddharth Starrer SPY Movie 1st Week Official Worldwide Box Office Collections

రన్ ముగిసినట్లే.. భారీ నష్టాలతో:నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ తప్ప ప్రతి రోజూ డౌన్ అవుతూనే వస్తుంది. దీంతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ రన్ ముగింపు దశకు చేరింది. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే దీనికి రూ. 5.50 కోట్లకు పైగానే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే నిఖిల్ కెరీర్‌లోనే భారీ లాస్ మూవీ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X