SPY 2 Days Collections: ఒక్కసారిగా వసూళ్లు డౌన్.. 2వ రోజే ఇలానా.. టోటల్‌గా అన్ని కోట్లతో ఊచకోతే!

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఈ జోష్‌లోనే అతడు ఏకధాటిగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు 'స్పై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ మాత్రం భారీగా దక్కాయి. అయితే, రెండో రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

స్పైగా వచ్చిన నిఖిల్ సిద్దార్థ్: నిఖిల్ సిద్దార్థ్ - గ్యారీ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ సినిమానే 'స్పై'. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

 SPY 2 Days Collections

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్: 'స్పై' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, మిగిలిన భాషల వెర్షన్లకు రూ. 2 కోట్ల బిజినెస్ అయింది. అలా మొత్తం రూ. 17.50 కోట్ల బిజినెస్ చేసింది.

2వ రోజు తెలుగులో ఎంతంటే?: 'స్పై' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 74 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 1.40 కోట్లు షేర్, రూ. 2.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 SPY 2 Days Collections

2వ రోజులకు కలిపితే ఎంత?: 'స్పై' మూవీకి 2 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో మంచి రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో.. రూ. 5.68 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా:నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 5.68 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.88 కోట్లు షేర్‌తో పాటు రూ. 13.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 SPY 2 Days Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'స్పై' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో దీనికి రూ. 7.88 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 10.62 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X