SPY 3 Days Collections: నిఖిల్‌కు షాక్.. శనివారం ఇంత తక్కువగానా.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

సాదాసీదాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నిఖిల్ సిద్దార్థ్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. పాన్ ఇండియా రేంజ్‌కు సైతం ఎదిగాడు.

ఈ జోష్‌లోనే ఇప్పుడు నిఖిల్ 'స్పై' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. మూడో రోజు కాస్త వసూళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

Nikhil Siddharth Starrer SPY Movie 3 Days Official Worldwide Box Office Collections

స్పైగా మారిన నిఖిల్ సిద్దార్థ్: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా గ్యారీ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమానే 'స్పై'. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు.

Nikhil Siddharth Starrer SPY Movie 3 Days Official Worldwide Box Office Collections

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్: నిఖిల్ 'స్పై' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, మిగిలిన భాషల వెర్షన్లకు రూ. 2 కోట్ల బిజినెస్ అయింది. అలా మొత్తం రూ. 17.50 కోట్ల బిజినెస్ చేసింది.

Nikhil Siddharth Starrer SPY Movie 3 Days Official Worldwide Box Office Collections

3వ రోజు తెలుగులో ఎంతంటే?: 'స్పై' సినిమాకు మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 1.01 కోట్లు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nikhil Siddharth Starrer SPY Movie 3 Days Official Worldwide Box Office Collections

3వ రోజులకు కలిపితే ఎంత?: 'స్పై' మూవీకి 3 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో మంచి రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 93 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో.. రూ. 6.69 కోట్లు షేర్, రూ. 10.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 6.69 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.29 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nikhil Siddharth Starrer SPY Movie 3 Days Official Worldwide Box Office Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'స్పై' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.50 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 9.29 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9.21 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X