SPY 4Days Collections: సండే షాకిచ్చే కలెక్షన్లు.. నిఖిల్‌కు విష్ణు దెబ్బ.. ఇంకా అన్ని కోట్లు రావాలా!
వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. దీనికితోడు 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్‌కు కూడా అతడు ఎదిగిపోయాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత వారంలోనే నిఖిల్ 'స్పై' అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. కానీ, ఆదివారం అనుకున్న రేంజ్‌లో రాలేదు. ఈ నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' 4 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!
స్పైగా ఎంటరైన నిఖిల్ సిద్దార్థ్:నిఖిల్ సిద్దార్థ్ - గ్యారీ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ సినిమానే 'స్పై'. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్:నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, మిగిలిన భాషల వెర్షన్లకు రూ. 2 కోట్ల బిజినెస్ అయింది. మొత్తం రూ. 17.50 కోట్ల బిజినెస్ చేసింది.
4వ రోజు తెలుగులో ఎంతంటే?:'స్పై' సినిమాకు నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 67 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4వ రోజులకు కలిపితే ఎంత?:'స్పై' మూవీకి 4 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో తక్కువ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 99 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 83 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 64 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో.. రూ. 7.16 కోట్లు షేర్, రూ. 11.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా:యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 7.16 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.72 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.98 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?:నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'స్పై' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.50 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజుల్లో దీనికి రూ. 9.98 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.52 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

నిఖిల్‌కు శ్రీవిష్ణు భారీ దెబ్బ:నిఖిల్ నటించిన 'స్పై' మూవీతో పాటు 'సామజవరగమన' కూడా గత గురువారమే విడుదలైంది. ఈ రెండు చిత్రాల్లో శ్రీవిష్ణు మూవీకే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం కలెక్షన్లను భారీ స్థాయిలో రాబట్టి విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఆదివారం 'సామజవరగమన' మూవీ నిఖిల్ 'స్పై' చిత్రానికి భారీ దెబ్బ కొట్టింది.


Click it and Unblock the Notifications











