SPY 5 Days Collections: నిఖిల్‌ స్పైకి షాక్.. ఆదిపురుష్ కంటే ఎక్కువగానే! ఎంతొచ్చిందంటే?

విభిన్నమైన చిత్రాలతో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవల కార్తికేయ 2తో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకోగా తాజాగా స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారారు. ఇందులో బ్యూటిఫుల్ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేయగా సాన్య ఠాకుర్ కీలక పాత్ర పోషించింది. మంచి అంచనాలతో జూన్ 29న విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో స్పై 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

కథాంశం:టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం స్పై. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న రహస్యం, ఆయన జీవితానికి సంబంధించిన పలు సన్నివేశాలతో ఆసక్తికర థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్పై సినిమా రూపొందినటనట్లు తెలుస్తోంది. ఇక స్పై టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రాగా అంచనాలు పెరిగిపోయాయి.

Nikhil Siddharth Starrer SPY Movie 5 Days Official Worldwide Box Office Collections

బిజినెస్ డీటేల్స్:నిఖిల్ మార్కెట్ కు తగినట్లుగానే స్పై చిత్రానికి బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్లతో ఏపీ, తెలంగాణలో మొత్తంగా రూ. 13.00 కోట్ల బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, మిగిలిన భాషల వెర్షన్లకు రూ. 2 కోట్ల బిజినెస్ అయింది. అంతా కలిపి రూ. 17.50 కోట్ల బిజినెస్ జరిగింది.

5వ రోజు:నిఖిల్-ఐశ్వర్య మీనన్ జోడీ కట్టిన స్పై చిత్రానికి కలెక్షన్స్ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఐదో రోజు సోమవారం మరింతగా తగ్గాయి. ఏపీ తెలంగాణలోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్నీ ఏరియాలు కలుపుకును రూ. 17 లక్షలు వచ్చాయి. కాగా ఆదిపురుష్ సినిమాకు 18వ రోజు రూ. 9 లక్షలు రావడంతో నిఖిల్ స్పైకి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి.

Nikhil Siddharth Starrer SPY Movie 5 Days Official Worldwide Box Office Collections

5 రోజుల్లో వచ్చింది..:యాక్షన్ అండ్ అడ్వంచర్ మూవీగా వచ్చిన స్పై సినిమాకు 5 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో తక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 85 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో.. రూ. 7.33 కోట్లు షేర్, రూ. 12 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nikhil Siddharth Starrer SPY Movie 5 Days Official Worldwide Box Office Collections

వరల్ వైడ్ గా:ఆర్యన్ రాజేష్ చాలా రోజులకు కీలక పాత్ర పోషించిన స్పై మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 7.33 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్లు తెచ్చుకోగలిగింది. అన్నీ ఏరియాలు కలుపుకుని ఐదు రోజుల్లో స్పై చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nikhil Siddharth Starrer SPY Movie 5 Days Official Worldwide Box Office Collections

అన్ని కోట్లు వస్తేనే!:నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ సినిమా స్పైకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.50 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక స్పై మూవీకి ఐదు రోజుల్లో రూ. 10.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.24 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను నమోదు చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X