SPY Total Collections: బిగ్ డిజాస్టర్‌గా స్పై.. ఏకంగా అన్ని కోట్లు నష్టం.. నిఖిల్ చెత్త రికార్డు

విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన రీతిలో సందడి చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా 'అర్జున్ సురవరం', 'కార్తికేయ 2', '18 పేజెస్' వంటి హ్యాట్రిక్ హిట్లను అందుకున్న అతడు.. ఫుల్ జోష్‌తో సాగుతున్నాడు.

ఈ ఊపులోనే ఇటీవలే నిఖిల్ 'స్పై' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. కానీ, దీనికి ప్రేక్షకులు పెద్దగా స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ చిత్రం నష్టాలతో రన్‌ను ముగించింది. మరి నిఖిల్ 'స్పై' మూవీ బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

Nikhil Siddharth Starrer SPY Movie Closing Official Worldwide Box Office Collections

స్పైగా నిఖిల్ సిద్దార్థ్ ఎంటర్: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'స్పై'. గ్యారీ తెరకెక్కించిన ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు.

Nikhil Siddharth Starrer SPY Movie Closing Official Worldwide Box Office Collections

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్: నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చేసిన 'స్పై' మూవీకి నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు మేర బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 15.50 కోట్ల బిజినెస్ చేసింది.

Nikhil Siddharth Starrer SPY Movie Closing Official Worldwide Box Office Collections

అలాంటి టాక్.. తక్కువగానే: యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'స్పై' మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఓపెనింగ్ భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే ఈ చిత్రం డౌన్ అవుతూ వస్తోంది. దీంతో క్రమంగా వసూళ్లు పడిపోయాయి. ఇలా ఈ సినిమా వారం రోజుల్లోనే దాదాపుగా రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఫలితంగా దీనికి కోట్లలోనే నష్టాలు కూడా ఎదురయ్యాయి.

Nikhil Siddharth Starrer SPY Movie Closing Official Worldwide Box Office Collections

తెలుగులో వసూళ్ల వివరాలు: 'స్పై' మూవీకి ఫుల్ రన్‌లో ఆంధ్రా, తెలంగాణలో తక్కువ రెస్పాన్స్‌ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 89 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో.. రూ. 7.66 కోట్లు షేర్, రూ. 12.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Nikhil Siddharth Starrer SPY Movie Closing Official Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ముగింపు సమయానికి రూ. 7.66 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.83 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఫుల్ రన్‌లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.79 కోట్లు షేర్‌తో పాటు రూ. 17.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. నష్టం ఎంతంటే: నిఖిల్ సిద్దార్థ్ నటించిన 'స్పై' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 10.79 కోట్లు వచ్చాయి. ఫలితంగా ఈ సినిమాకు రూ. 5.71 కోట్లు నష్టాలు ఎదురై బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

Nikhil Siddharth Starrer SPY Movie Closing Official Worldwide Box Office Collections

హిట్లకు బ్రేక్.. చెత్త రికార్డుతో: నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి దారుణమైన వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే ఎక్కువ నష్టాలను మూటగట్టుకుని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా చెత్త రికార్డును నమోదు చేసింది. అదే సమయంలో వరుస హిట్లతో దూసుకుపోతోన్న నిఖిల్‌కు షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగున్నా దాన్ని నడిపించిన తీరు.. హడావిడిగా రిలీజ్ చేయడం దీనికి మైనస్‌గా మారాయని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X