SPY Day 1 Collections: నిఖిల్ పెను సంచలనం.. తొలి రోజే అన్ని కోట్లు.. టాప్ మూవీగా ‘స్పై’ రికార్డు
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుస సక్సెస్‌లో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. 'అర్జున్ సురవరం' నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిఖిల్ 'స్పై' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా రెస్పాన్స్ లభించింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'స్పై' ఫస్ట్ డే రిపోర్టును మీరే చూసేయండి!
'స్పై'గా మారిపోయిన నిఖిల్: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమానే 'స్పై'. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. దగ్గుబాటి రానా, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్: 'స్పై' మూవీ నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లు, మిగిలిన భాషల వెర్షన్లకు రూ. 2 కోట్ల బిజినెస్ అయింది. అలా మొత్తం రూ. 17.50 కోట్ల బిజినెస్ చేసింది.
టాక్‌తో సంబంధం లేకుండానే: యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'స్పై' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో రావని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ మూవీ దుమ్ము దులిపేసింది.

ఫస్ట్ డే తెలుగులో ఎంతంటే?: 'స్పై' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. రూ. 4.28 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా: నిఖిల్ నటించిన 'స్పై' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 4.28 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 46 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.02 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?: టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన 'స్పై' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 6.02 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 12.45 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

నిఖిల్ కెరీర్‌లోనే టాప్ మూవీగా: ఎంతో హడావిడిగా విడుదలైనా.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా 'స్పై' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 4.25 కోట్లు వసూలు చేసింది. తద్వారా నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు కార్తికేయ 2 రూ. 3.50 కోట్లతో టాప్‌లో ఉండేది.


Click it and Unblock the Notifications











