twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూసుకెళ్తున్న ‘అర్జున్ సురవరం’.. లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్.. నిఖిల్ కామెంట్

    |

    టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ సురవరం'. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించగా, ఆయన సరసన లావణ్య త్రిపాఠి నటించింది. నవంబర్ 29న విడుదలైన తొలిరోజే పాజిటివ్ స్పందన తెచ్చుకుంది. విజయవంతంగా వీకెండ్ పూర్తిచేసిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ మేరకు ఈ రిపోర్ట్ తెలుపుతూ హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. వివరాల్లోకి పోతే..

     లేటయితేనేం థ్రిల్ అదే

    లేటయితేనేం థ్రిల్ అదే

    నిజానికి 'అర్జున్ సురవరం' సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయి గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేటుగా వచ్చినా హంగామాలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా దూసుకుపోతూ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది 'అర్జున్ సురవరం'.

    నాలుగో రోజు వరకూ జోష్

    నాలుగో రోజు వరకూ జోష్

    ఈ మేరకు తొలిరోజే మంచి కలెక్షన్స్ రాబట్టిన 'అర్జున్ సురవరం' సినిమా అదే జోష్ కొనసాగిస్తూ నాలుగో రోజు వరకూ కొనసాగింది. మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 1.15 కోట్ల రేంజ్‌లో షేర్‌ని అందుకున్న ఈ సినిమా అదే రేంజ్‌లో కాస్త అటు ఇటుగా కలెక్షన్స్ రాబట్టింది.

    నిఖిల్ కామెంట్.. కలెక్షన్స్ ఇవీ అంటూ ట్వీట్

    నిఖిల్ కామెంట్.. కలెక్షన్స్ ఇవీ అంటూ ట్వీట్

    బాక్సాఫీస్ 'అర్జున్ సురవరం' సినిమా పర్‌ఫార్‌మెన్స్ చూసిన హీరో నిఖిల్.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కలెక్షన్ రిపోర్ట్‌తో కూడిన పోస్టర్ షేర్ చేశాడు. ఈ సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 12.3 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలిపాడు. ఈ మేరకు ఈ సినిమాను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు నిఖిల్.

    'అర్జున్ సురవరం' హైదరాబాద్ సక్సెస్ టూర్

    'అర్జున్ సురవరం' విజయాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది చిత్రయూనిట్. ఈ మేరకు ఈ షెడ్యూల్ వివరాలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

    Recommended Video

    #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
    ఆ జోష్ చూస్తుంటే..

    ఆ జోష్ చూస్తుంటే..

    ఇక 'అర్జున్ సురవరం' జోష్ చూస్తుంటే ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సరైన పోటీగా ఏ సినిమా లేకపోవడం కారణంగా ఈ వారం కూడా 'అర్జున్ సురవరం' జోష్ కనిపిస్తుందని పేర్కొంటున్నారు.

    English summary
    Tollywood Young Hero Nikhil Siddharth new movie Arjun Suravaram. This movie released and successfully completed 4 days. This report is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X