twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 Pages 13 Days Collections: 13వ రోజు దారుణంగా.. టోటల్‌గా అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే!

    |

    టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒకడు. సైడ్ హీరోగా కెరీర్‌ను మొదలెట్టి.. ఇప్పుడు వరుస విజయాలతో సత్తా చాటుతోన్నాడు.

    దీంతో అతడి క్రేజ్, మార్కెట్ మరింతగా పెరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి స్పందన మంచిగానే దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    18 పేజెస్‌తో వచ్చేసిన నిఖిల్

    18 పేజెస్‌తో వచ్చేసిన నిఖిల్

    నిఖిల్ సిద్ధార్థ్ - పల్నాటి సూర్య ప్రతాప్ కలయికలో రూపొందిన చిత్రమే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు.

    ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

    నిఖిల్ మూవీకి ముందే లాభాలు

    నిఖిల్ మూవీకి ముందే లాభాలు

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నాన్ థియేట్రికల్‌ రైట్స్‌కు అదిరిపోయే బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా అలా ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది.

    13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

    13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

    టాలెంటెడ్ గాయ్ నిఖిల్ సిద్ధార్థ్ - క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 13 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

    Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!

    13 రోజుల్లో ఎంత వసూలైంది?

    13 రోజుల్లో ఎంత వసూలైంది?

    13 రోజుల్లో '18 పేజెస్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 89 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో మొత్తంగా రూ. 8.09 కోట్లు షేర్, రూ. 15.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 8.09 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 72 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.48 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 13 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.29 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    Anchor Prashanthi: గృహలక్ష్మి లాస్య హాట్ షో.. ఎద భాగాన్ని హైలైట్ చేస్తూ అరాచకంగా!Anchor Prashanthi: గృహలక్ష్మి లాస్య హాట్ షో.. ఎద భాగాన్ని హైలైట్ చేస్తూ అరాచకంగా!

    మరింతగా పెరుగుతోన్న లాభం

    మరింతగా పెరుగుతోన్న లాభం

    'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా సక్సెస్‌తో తన స్టామినాను చాటుకున్న నిఖిల్ '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు సొంతం అవుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఇది దాదాపు పది కోట్ల వరకూ లాభాలొచ్చాయి.

    English summary
    Nikhil Siddhartha Did 18 Pages Movie Under Palnati Surya Pratap Directions. This Movie Collect 10.29 CR in 13 Days..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X