18 Pages Collections: రిలీజ్‌ ముందే ప్రాఫిట్స్.. వారంలోనే అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే షాకే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి విలక్షణమైన నటనతో, విభిన్నమైన చిత్రాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోన్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కెరీర్ ఆరంభం నుంచే తనదైన పంథాను ఫాలో అవుతూ సినిమాలు చేస్తోన్న అతడు.. సత్ఫలితాలను రాబడుతూ స్టామినాను పెంచుకుంటోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఫుల్ ఫామ్‌లో ఉన్న నిఖిల్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ వారం రోజుల రిపోర్టును చూడండి!

18 పేజెస్‌తో వచ్చేసిన నిఖిల్

18 పేజెస్‌తో వచ్చేసిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - పల్నాటి సూర్య ప్రతాప్ కాంబోలో వచ్చిన మూవీనే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రలు చేశారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో నాన్ థియేట్రికల్‌ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఫలితంగా అలా ఈ మూవీ దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చి నిర్మాతలు సేఫ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

'18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు వసూళ్లు కాస్త తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 29 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 48 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

వారంలో ఎంత వసూలైంది?

వారంలో ఎంత వసూలైంది?


'18 పేజెస్' మూవీ వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో మొత్తంగా రూ. 6.22 కోట్లు షేర్, రూ. 11.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


నిఖిల్ సిద్దార్థ్ - అనుపమ జంటగా చేసిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 6.22 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.22 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.09 కోట్లు షేర్‌తో పాటు రూ. 15.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

అప్పటి నుంచీ లాభాల బాటలో

అప్పటి నుంచీ లాభాల బాటలో

నిఖిల్ హీరోగా నటించిన '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు దక్కుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు అన్నీ నిర్మాతలకు ప్రాఫిట్స్‌నే అందించాయని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X