twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 Pages 4 Days Collections: సోమవారం ఒక్కసారిగా డౌన్.. ఇలా అయితే నష్టాలు తప్పవు?

    |

    యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో తన మార్కెట్ రేంజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. నిఖిల్ కార్తికేయ 3 సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో '18 పేజెస్' అనే లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మొదట్లోనే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక 18 పేజెస్ సినిమా 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

    నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 18 పేజెస్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కుమార్ 21F ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథ కథనాలు అందించారు. ఇక బడా నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ తో కలిపి సుకుమార్ రైటింగ్స్ కూడా సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఏరియాల వారిగా ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఏపీ తెలంగాణలో రూ. 10.00 కోట్ల బిజినెస్ చేయగా.. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్ రూ. 12.00 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది.

    టేబుల్ ప్రాఫిట్స్

    టేబుల్ ప్రాఫిట్స్

    18 పేజెస్ సినిమాకు ముందు నుంచి మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నాన్ థియేట్రికల్ గా కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. ఇక ఆ రూట్లో సినిమా దాదాపు 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందించినట్లు టాక్. ఇక నిఖిల్ నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో మిగతా భాషల్లో డబ్బింగ్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ఆ విధంగా కూడా నిర్మాతలు సేఫ్ అయ్యారు.

    4వ రోజు కలెక్షన్స్

    4వ రోజు కలెక్షన్స్

    '18 పేజెస్' సినిమా తెలంగాణ నైజాంలో 4వ రోజు ఎంత ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.. నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో మొత్తంగా రూ. 0.78 కోట్లు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

    4 రోజుల్లో నైజాం, ఏపీ కలెక్షన్స్

    4 రోజుల్లో నైజాం, ఏపీ కలెక్షన్స్

    4 రోజుల్లో '18 పేజెస్' సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 2.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో మొత్తంగా రూ. 4.51 కోట్లు షేర్, రూ. 8.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

     వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్


    వీకెండ్స్ బాగానే అందుకున్న ఈ సినిమా అనంతరం సోమవారినికి కొంత డౌన్ అయ్యింది. ఇక 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే 18 పేజెస్ 4 రోజుల్లో తెలుగు స్టేట్స్ లో రూ. 4.51 కోట్లు వసూలు చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 48 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 74 లక్షలు వచ్చాయి. ఇక మొత్తంగా 4 రోజుల్లో 18 పేజెస్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.73 కోట్లు షేర్‌, రూ. 11.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఇలా అయితే కష్టమే..

    ఇలా అయితే కష్టమే..

    '18 పేజెస్' సినిమా మొదటి మూడు రోజుల్లో హాలిడేస్ ను బాగా యూజ్ చేసుకుంది. పోటీగా అవతార్ ధమాకా ఉన్నప్పటికీ ఆదివారం కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక రూ. 12.00 కోట్లు మేర బిజినెస్ చేసిన 18 పేజెస్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.50 కోట్లకు ఫిక్స్ అయ్యింది. ఇక 4 రోజుల్లో ఈ సినిమా షేర్ రూ. 5.78 కోట్లు వచ్చింది.. అంటే హిట్ కావాలి అంటే ఇంకా రూ. 5.73 కోట్లు అందుకోవాల్సి ఉంటుంది. సోమవారం అయితే కలెక్షన్స్ బాగా తగ్గాయి. ఇక ఈ టార్గెట్ ను పూర్తి చేయాలి అంటే ఇంకా హై లెవెల్లో కలెక్షన్స్ రావాల్సి ఉంది.

    English summary
    Nikhil Siddhartha 18 Pages Movie 4 Days Box Office Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X