twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

18 Pages Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. 8వ రోజు మరీ తక్కువగా.. లాభాలు మాత్రం కోట్లలోనే!

విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటోన్న ఈ హీరో మంచి ఫలితాలను రాబట్టుకుంటూ మార్కెట్‌ను పెంచుకుంటోన్నాడు. ఇక, తన గత చిత్రం 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే నిఖిల్ ఇప్పుడు '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 8 రోజుల రిపోర్టును మీరే చూడండి!

18 పేజెస్‌ అంటూ వచ్చేశాడు

18 పేజెస్‌ అంటూ వచ్చేశాడు

టాలెంటెడ్ గాయ్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన మూవీనే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రలు చేశారు.

Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తొలగింపు.. కోర్టు తీర్పుతో వాళ్లకు షాక్.. రికార్డులపై తీవ్ర ప్రభావం
Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తొలగింపు.. కోర్టు తీర్పుతో వాళ్లకు షాక్.. రికార్డులపై తీవ్ర ప్రభావం

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

యంగ్ హీరో నిఖిల్ '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో నాన్ థియేట్రికల్‌ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఫలితంగా అలా ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

'18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు వసూళ్లు బాగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 17 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 27 లక్షలు షేర్, రూ. 52 లక్షలు గ్రాస్ వసూలైంది.

నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి
నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

8 రోజుల్లో ఎంత వసూలైంది?

8 రోజుల్లో ఎంత వసూలైంది?

'18 పేజెస్' మూవీ 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 68 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో మొత్తంగా రూ. 6.49 కోట్లు షేర్, రూ. 12.37 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

నిఖిల్ - అనుపమ కలిసి నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 6.49 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 66 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.26 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.41 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

వసూళ్లు తగ్గినా లాభాలతోనే

వసూళ్లు తగ్గినా లాభాలతోనే

నిఖిల్ హీరోగా చేసిన '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు సొంతం అవుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు అన్నీ నిర్మాతలకు ప్రాఫిట్స్‌నే అందించాయని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

English summary
Nikhil Siddhartha Did 18 Pages Movie Under Palnati Surya Pratap Directions. This Movie Collect 8.41 CR in 8 Days.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X