18 Pages Collections: 9వ రోజు నిఖిల్‌కు షాక్.. పెరుగుతాయనకుంటే డౌన్.. లాభాలు మాత్రం అన్ని కోట్లు

టాలీవుడ్‌లోని ఎంతో మంది యంగ్ హీరోల నుంచి పోటీని తట్టుకోవడంతో పాటు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటోన్న అతడు.. గత ఏడాదిలో 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే నిఖిల్ ఇప్పుడు '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

నిఖిల్ 18 పేజెస్‌ అనే ప్రయోగం

నిఖిల్ 18 పేజెస్‌ అనే ప్రయోగం


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - పల్నాటి సూర్య ప్రతాప్ కలయికలో వచ్చిన మూవీనే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు.

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

నిఖిల్ మూవీకి ముందే లాభాలు


టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో నాన్ థియేట్రికల్‌ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఫలితంగా అలా ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలిసింది.

 9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది


9వ రోజు '18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింతగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 22 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలైంది.

 9 రోజుల్లో ఎంత వసూలైంది?

9 రోజుల్లో ఎంత వసూలైంది?


'18 పేజెస్' మూవీ 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 69 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో మొత్తంగా రూ. 6.71 కోట్లు షేర్, రూ. 12.77 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


నిఖిల్ - అనుపమ జంటగా నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 6.71 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 67 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.29 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.67 కోట్లు షేర్‌తో పాటు రూ. 17.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

నిర్మాతలకు దండిగా లాభాలు

నిర్మాతలకు దండిగా లాభాలు


పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా చేసిన '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు సొంతం అవుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు అన్నీ నిర్మాతలకు ప్రాఫిట్స్‌నే అందించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X