18 Pages Closing Collection: నిఖిల్ 18 పేజీస్ హిట్టా? ఫట్టా? అరవింద్ కు లాభం వచ్చిందా అంటే?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా కలిసి మరోసారి నటించిన చిత్రం 18 పేజీస్. కరెంట్, కుమార్ 21F వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలైంది.
అయితే థియేటర్లలో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన.. కొంతమంది మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అని పొగిడారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫుల్ రన్ లో ఎన్ని కలెక్షన్స్ వసూళు చేసిందో ఓ లుక్కేద్దామా!

కార్తికేయ 2 తర్వాత..
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. సైడ్ హీరోగా కెరీర్‌ను మొదలెట్టి ఇప్పుడు వరుస విజయాలతో సత్తా చాటుతోన్నాడు. దీంతో అతడి క్రేజ్, మార్కెట్ మరింతగా పెరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే కార్తికేయ 2 తర్వాత '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్.

ప్రీ రిలీజ్ బిజినెస్..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్‌కు అదిరిపోయే బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావం ఈ సినిమాపై పడింది. దీంతో నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 4.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.50 కోట్ల బిజినెస్ అయింది. ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 1.30 కోట్లు జరగ్గా వరల్డ్ వైడ్ గా రూ. 10.30 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ రూ. 11 కోట్లుగా ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల్లో..
గోపీ సుందర్ సంగీతం అందించిన '18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 5.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోటీ, ఉత్తరాంధ్రాలో రూ. 1.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో మొత్తంగా రూ. 9.44 కోట్లు షేర్, రూ. 18 కోట్లు గ్రాస్ టోటల్ గా వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన '18 పేజెస్' చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్ టైమ్ లో రూ. 9.44 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.63 కోట్లు వచ్చాయి. ఇవన్నీ కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా లాంగ్ రన్ టైమ్ లో రూ. 11.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 23.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

లాభం ఎంతంటే..
'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా సక్సెస్‌తో తన స్టామినా చూపించిన నిఖిల్ '18 పేజెస్' సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి మంచి లాభాలు వచ్చాయి.
ఇక వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా ఫిక్స్ కాగా.. ఫుల్ రన్ టైమ్ లో రూ. 11.83 కోట్లు వసూళు చేసింది. అంటే రూ. 83 లక్షల లాభంతో హిట్ స్టేటస్ సొంతం చేసుుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు (అల్లు అరవింద్) డబ్బింగ్ రైట్స్ ద్వారా రూ. 6 కోట్ల టేబుల్ ప్రాఫిట్ రాగా.. మరో రూ. 83 లక్షలు యాడ్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











