18 Pages Pre Release Bussiness: విడుదలకు ముందే ప్రాఫిట్ తెచ్చిన సినిమా.. టార్గెట్ ఎంతంటే?
నిఖిల్ సిద్దార్థ్ నటించిన 18 పెజెస్ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది. గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA 2 సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కుమారి 21F దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మొత్తం బిజినెస్ ఎంత? అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అని వివరాల్లోకి వెళితే..

డిఫరెంట్ లవ్ స్టొరీగా..
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన 18 పేజెస్ సినిమా ఓవర్గం ప్రేక్షకులలో పాజిటివ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. డిఫరెంట్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాలో ఎప్పుడూ చూడని ఒక లవ్ స్టోరీ ట్విస్ట్ ఉంటుంది అని కూడా చిత్ర యూనిట్ బాగానే హైలైట్ చేసింది. ఇక సుకుమార్ రాసిన కథ కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

విడుదలకు ముందే ప్రాఫిట్
ఇక 10 పేజెస్ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 16 కోట్లు అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలను కూడా సుకుమార్ సలహా మేరకు రీషూట్ చేసినట్లుగా నిఖిల్ తెలియజేశాడు. ఇక నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వెనక్కి తీసుకువచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడిలో సినిమా విడుదల కాకముందే దాదాపు 6 కోట్ల వరకు ప్రాఫిట్ అందించింది.

నైజాం ఆంధ్ర బిజినెస్
ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజాం ఏరియాలో 3.50 కోట్ల ధర పలికిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 1.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక ఆంధ్రాలో 5 కోట్లు వరకు బిజినెస్ చేయగా.. ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా దాదాపు 10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18 పేజెస్ సినిమా 0.50 కోట్ల వరకు ధర పలికింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉండడంతో అక్కడ 1.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 18 పేజెస్ సినిమా మొత్తంగా 12 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.50 కోట్లు వరకు ఫిక్స్ అయింది.

ఫామ్ లో ఉన్న నిఖిల్
నిఖిల్ కార్తికేయ 3 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఇంతకుముందు వచ్చిన అర్జున్ సురవరం సినిమాతో పాటు కిరాక్ పార్టీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా కార్తికేయ 2 అయితే 59 కోట్లకు పైగా లాభాలను అందించింది. ఇక ఇప్పుడు 18 పేజెస్ కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్ అందిస్తుంది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











