Spy Movie Pre Release Bussiness: నిఖిల్ సిద్దార్థ్ మరో పాన్ ఇండియా టార్గెట్ రెడీ.. ఎంత రావాలంటే?
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్పై' సినిమా ఈనెల 29వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్ ఈసారి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తన సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇక ఈ సినిమా డిసెంట్ తరహాలోనే బిజినెస్ అయితే చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద స్పై సినిమా ఏరియాల వారిగా ఎంత బిజినెస్ చేసింది? సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు షేర్ కలెక్షన్స్ రావాలి? అనే వివరాలలోకి వెళితే..
నార్త్ ఇండస్ట్రీలో కూడా:నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా మొదట తెలుగులో మంచి టాక్ సొంతం చేసుకున్న తర్వాతనే మిగతా భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదలైంది. ముఖ్యంగా హిందీలో రోజురోజుకీ థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లి మంచి కలెక్షన్స్ అందుకుంది. మొత్తానికి మొదటిసారి నిఖిల్ ఆ సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ చూశాడు. ఈసారి అతనికి నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అయితే పెరిగింది.

ఈసారి కూడా అదే నమ్మకం: ఇక ఇప్పుడు తప్పకుండా ఆ సినిమా క్రేజ్ స్పై సినిమాకు కూడా ఉపయోగపడుతుంది అని నిఖిల్ ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అంతేకాకుండా ప్రమోషన్స్ కంటే కూడా కంటెంట్ ద్వారానే అతను జనాలకు చేరుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కార్తికేయ 2 విషయంలో కూడా నిఖిల్ అదే ఫాలో అయ్యాడు. కంటెంట్ క్లిక్ అయిన తర్వాతనే అక్కడికి వెళ్లి రెగ్యులర్ గా ప్రమోషన్ చేశాడు. ఇక నిఖిల్ స్పై కూడా తప్పకుండా కంటెంట్ ద్వారానే నార్త్ ఇండస్ట్రీలో మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నాడు.

మిస్టరీ నేపథ్యంలో..: రాజశేఖర్ కథను అందించడమే కాకుండా ఈ సినిమాను భారీ స్థాయిలోనే నిర్మించడం జరిగింది. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తనకెక్కించినట్లుగా టీజర్ ట్రైలర్ ద్వారానే క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా దాని వెనకున్న మిస్టరీ సినిమాలో అద్భుతంగా అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పారు. ఈ సినిమాకు గ్యారీ దర్శకత్వం వహించారు.

నైజాం - ఆంధ్రలో చేసిన బిజినెస్:ఇక ఈ సినిమా మార్కెట్లో డిమాండ్ కు తగ్గట్టుగానే మంచి బిజినెస్ అయితే చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే నైజంలో అత్యధికంగా 5 కోట్ల ధర పలికిన ఈ సినిమాలో రెండు కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక ఆంధ్ర ఏరియా మొత్తంలో చూసుకుంటే దాదాపు 6 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టోటల్ గా స్పై సినిమా 13 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈసారి టార్గెట్ ఎంతంటే..:ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ముందుగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 70 లక్షల్లో బిజినెస్ చేయగా ఓవర్సీస్ లో 1.80 కోట్ల రేంజ్ లో ధర పలికింది. ఇక మిగతా భాషల్లో మొత్తంగా చూసుకుంటే 2 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని ఏరియాలో కలుపుకొని స్పై సినిమా ప్రపంచవ్యాప్తంగా 17.50 కోట్లకు రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావాలి అంటే 18 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ సాధించాలి. మరి నిఖిల్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











