Nilave Box Office: నిలవే బాక్సాఫీస్ జోరు.. కలెక్షన్ల ఊపుతో నిర్మాత, దర్శకుల సక్సెస్ జోష్!

కంటెంట్ బలంగా ఉంటే నటీనటులు, సాంకేతిక నిపుణులు కొత్తవారైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఎన్నోసార్లు తెలుగు సినిమా పరిశ్రమలో రుజువైంది. అయితే నూతన నటీనటులు సౌమిత్ పొలాడీ, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. పాయింట్ ఆఫ్ వ్యూ (POV) బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ సినిమాలో సౌమిత్ పోలాడి నటించడమే కాకుండా సాయి కే వెన్నంతో దర్శకత్వం వహించారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రల్లో నటించారు.

బడ్జెట్‌ పరంగా రాజీ లేకుండా హైక్లాస్ క్వాలిటీతో రూపొందిన ఈ సినిమాకు సంగీతం: కళ్యాణ్ నాయక్, సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్ అందించారు. ఎడిటర్‌గా సత్య జీ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన రిలీజైన ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు అందుకొంటూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెరుగైన కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా సక్సెస్ బాటలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సంబురాల్లో మునిగి సక్సెస్ మీట్ జరుపుకొన్నది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన విశేషాలు, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Nilave Box Office Collections

ఎమోషనల్ ప్రేమ కథగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటీనటులు సహజంగా నటించడం, ఎమోషన్స్‌ ఎలివేట్ కావడంతో ప్రేక్షకుల ఆదరణ భారీగా లభించింది అని నిర్మాత, దర్శకులు తెలిపారు.

ఇక ఈ చిత్రంపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో రిలీజ్‌కు ముందే ప్రీమియర్స్‌ను వేశారు. రెండు ప్రదేశాల్లో రెండు స్క్రీన్లలో వేసిన రెండు షోలకు మంచి స్పందన లభించింది. ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్‌తోపాటు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ సినిమా సుమారుగా 30 లక్షల రూపాయలు, రెండో రోజు 35 లక్షల రూపాయలు, మూడో రోజు 30 లక్షల రూపాయలతో తొలి వారాంతం 1.05 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. నాలుగో రోజు 25 లక్షల రూపాయలు, ఐదో రోజు 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆరో రోజు కూడా సుమారుగా 20 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయ. దాంతో ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కలిపి 2 కోట్ల రూపాయల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలిపారు.

సక్సెస్ మీట్‌లో పలువరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు కలిగింది. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్‌ గీతాంజలిలా నిలవే చిత్రం నిలుస్తుంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన రాజ్ అల్లాడ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సాయి విజన్, దిలీప్ విజువల్స్‌, కళ్యాణ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరాయి అని సినీ ప్రముఖులు తమ అభిప్రాయలను వెల్లడించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

నిలవే సక్సెస్ మీట్‌లో వీ సముద్ర, జెమినీ సురేష్, ఆర్ ఎల్ ట్రావెల్స్ అధినేత అనురాధ గారు, అనిల్ కడియాల, నటుడు రూపేష్ తదితరులు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా కంగ్రాట్స్ తెలిపారు. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకొన్నారు. బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: Nilave Sowmith Rao Sai Vennam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X