Jabilamma Day 1 Collections: షాకింగ్‌గా జాబిలమ్మ కలెక్షన్లు.. ధనుష్ మూవీకి దారుణంగా ఓపెనింగ్స్
తమిళ సూపర్ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించగా ఆయన కుటుంబ సభ్యులు కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి రాజా నిర్మించిన చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా? తమిళంలో నీలవుకు ఎన్మెల్ ఎన్నాది కోబమ్ టైటిల్‌తో రిలీజైన ఈ చిత్రంలో పవిష్, అనిక సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, రమ్య రఘురామన్, వెంకటేశ్ మీనన్, ఆడు కాలమ్ నరేన్ తదితరులు నటించారు. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా యువ నటీనటులు, జీవీ ప్రకాశ్ కుమార్, జీకే ప్రసన్న, లీయాన్ బ్రిట్టో లాంటి టాలెంటెడ్ సీనియర్ టెక్నిషియన్స్‌తో కలిపి రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిచ్‌గా, టెక్నికల్‌గా మంచి క్వాలిటీ, స్టాండర్డ్స్‌తో రూపొందించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను అన్ని రకాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు.

తమిళం, తెలుగులో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాకు అంతే విధంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి తమిళనాడులో 25 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక తెలుగులో 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని నెమ్మదిగానే కొనసాగించింది.
ఇక తమిళంలో ఈ సినిమాకు గొప్పగా వసూళ్లు నమోదు కాకపోవడం షాకింగ్ కలిగించే అంశం. ఈ సినిమా తొలి రోజు 60 లక్షల రూపాయలు తమిళంలో, 20 లక్ష్లల రూపాయలు తెలుగులో, కన్నడ, ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీ 40 లక్షలు కలెక్ట్ చేస్తుందని వెల్లడించారు. దాంతో ఇండియాలో 1.2 కోట్ల రూపాయలు నికరంగా, 2.5 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 1 కోటి రూపాయల నెట్, 2 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనాకు వచ్చారు. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











