Jabilamma Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద ధనుష్ మూవీ భారీ వసూళ్లు.. 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళ సూపర్ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించగా ఆయన కుటుంబ సభ్యులు కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి రాజా నిర్మించిన చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా? తమిళంలో నీలవుకు ఎన్మెల్ ఎన్నాది కోబమ్ టైటిల్‌తో రిలీజైన ఈ చిత్రంలో పవిష్, అనిక సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, రమ్య రఘురామన్, వెంకటేశ్ మీనన్, ఆడు కాలమ్ నరేన్ తదితరులు నటించారు. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా యువ నటీనటులు, జీవీ ప్రకాశ్ కుమార్, జీకే ప్రసన్న, లీయాన్ బ్రిట్టో లాంటి టాలెంటెడ్ సీనియర్ టెక్నిషియన్స్‌తో కలిపి రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిచ్‌గా, టెక్నికల్‌గా మంచి క్వాలిటీ, స్టాండర్డ్స్‌తో రూపొందించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను అన్ని రకాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Nilavuku Enmel Ennadi Kobam NEEK Day 2 Expected Box Office Collections Worldwide Dhanush Movie Decent start at GBOC

జాబిలమ్మ నీకు అంతా కోపమా? సినిమా కథ విషయానికి వస్తే.. ఛెఫ్‌గా పనిచేసే యువకుడు ప్రభు (పవిష్)‌కు నీలా (అనికా సురేంద్రన్)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే ఏడాది తర్వాత కొడుకు బాధ చూడలేక పెళ్లి చేయాలని తల్లిదండ్రులు (ఆడుకాలమ్ నరేన్) ఫిక్స్ అవుతారు. దాంతో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా అక్కడ అమ్మాయి (ప్రియా ప్రకాశ్ వారియర్)ని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరి మనసును మరొకరు తెలుసుకొనేందుకు జర్నీని ప్రారంభిస్తారు. ఆ క్రమంలో వారిద్దరి జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి చెప్పుకొంటారు. ఆ క్రమంలో నీలా పంపిన శుభలేఖను చూసి షాక్ అవుతాడు.అయితే మళ్లీ నీలాను ప్రభు కలిశాడా? ప్రియా ప్రకాశ్ వారియర్‌ను వివాహం చేసుకొన్నాడా? అనేది ఈ సినిమా కథ.

తమిళం, తెలుగులో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాకు అంతే విధంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి తమిళనాడులో 25 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక తెలుగులో 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని నెమ్మదిగానే కొనసాగించింది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు కరెంట్ బుకింగ్ భారీగా పెరగడంతో కలెక్షన్లు భారీగా నమోదు అయ్యాయి.

ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఆంధ్రాలో 50 లక్షలు, కర్ణాటకలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Nilavuku Enmel Ennadi Kobam NEEK Day 2 Expected Box Office Collections Worldwide Dhanush Movie Decent start at GBOC

ఇక రెండో రోజు వసూళ్ల అంచనా విషయానికి వస్తే.. ఈ మూవీకి ఓవరాల్‌గా 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాంలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 4.5 కోట్ల రూపాయలు నమోదు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: dhanush priya prakash varrior
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X