Ninnu Kori Re Release Collections: నిన్ను కోరి రీ రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. నాని మూవీకి ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, సుదర్శన్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ ఘట్టమనేని, ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్‌గా గోపి సుందర్ వ్యవహరించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా 2017 సంవత్సరం జూలై 8వ తేదీన రిలీజై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత రీ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ రిలీజ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి? గత 6 రోజులుగా ఏ మేరకు కలెక్షన్లు సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

Ninnu Kori Re Release Box Office Collections

కాలేజీ డేస్‌లో ఉమా మహేశ్వర్ రావు అలియాస్ ఉమ (నాని), పల్లవి (నివేదా థామస్) ప్రేమించుకొంటారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో అరుణ్ (ఆది పినిశెట్టి)తో వివాహం జరుగుతుంది. పల్లవి, అరుణ్ అమెరికాలో సెటిల్ అవుతారు. అయితే ఊహించని విధంగా పల్లవి, అరుణ్ ఇంట్లోకి ఉమ అడుగుపెడుతాడు. అయితే వారిద్దరి ప్రేమ మళ్లీ చిగురించిందా? పల్లవితో ఉమ ప్రేమ గురించి అరుణ్‌కు తెలిసిందా? ఉమ కోసం అరుణ్ తన మ్యారేజ్ లైఫ్‌ను త్యాగం చేశాడా? ఉమ, పల్లవి, అరుణ్ మధ్య జరిగిన డ్రామా ఏమిటనేది ఈ సినిమా కథ.

ఇలాంటి రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాను డీవీవీ దానయ్య భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. ఈ సినిమాను 18 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేసి రిలీజ్ చేస్తే.. ఈ చిత్రం భారీ విజయం అందుకొని సుమారుగా 53 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో డీవీవీకి భారీ లాభాలు వచ్చాయి. అయితే ఇలాంటి క్లాసిక్‌ను ఈ తరం వారికి చూపించేందుకు రీ రిలీజ్ చేశారు. అయితే రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మెరుగైన ఫలితాలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా రీ రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. మే 7వ తేదీన ఈ చిత్రం 1.5 లక్షల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజున 55 లక్షల రూపాయలు, రెండో రోజున 35 లక్షల రూపాయలు, మూడో రోజున 30 లక్షల రూపాయలు, నాలుగు రోజున 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 1.4 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ చిత్రం 5వ రోజున 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 1.5 కోట్ల రూపాయల మేర నమోదు అవుతాయని పేర్కొన్నారు.

నిన్ను కోరి సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 53 కోట్ల గ్రాస్ ఫస్ట్ రిలీజ్ రూపంలో రాబట్టగా, రీ రిలీజ్ సమయంలో 1.5 కోట్ల రూపాయలు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం టోటల్‌గా 54.5 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను నమోదు చేసినట్టు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Read more about: ninnu kori nani box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X