రవితేజ 'నిప్పు' బిజెనెస్ పొజిషన్ ఏంటి
రవితేజ తాజా చిత్రం నిప్పు మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ గురించి అన్ని ఏరియాలనుంచి బిజినెస్ ఎంక్వైరీలు జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం సీడెడ్ రైట్స్ ని మూడు కోట్లు ఇచ్చి తీసుకున్నారు. గతంలో ఆర్.ఆర్.మూవి మేకర్స్ పతాకంపై కిక్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసారు రవితేజ. ఇక సంక్రాంతికి ఈ చిత్రం అనుకున్నట్లు విడుదల అయితే సీడెడ్ లో మంచి ఓపినింగ్స్ ఉంటాయని భావించి రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం మళ్లీ గుణశేఖర్ కి పూర్వ వైభవం తీసుకొస్తుందని భావిస్తున్నాడు.
రవితేజ సరసన పొడుగుకాళ్ళ సుందరి దీక్షాసేథ్ నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: కనల్‌కణ్ణన్, డాన్స్: రాజు సుందరం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఆర్.కిషోర్, కో-ప్రొడ్యూసర్స్: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.యస్.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











