ఫైనల్ గా..నిప్పు,లవ్ ఫెయిల్యూర్
రవితేజ, దీక్షాసేధ్ కాంబినేషన్ లో గుణశేఖర్ రూపొందించిన చిత్రం నిప్పు. వైవియస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలైంది. రిలైజైన రోజే మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో వీకెండ్,పండుగరోజు లో ఓ మాదిరి కలెక్షన్స్ రాబట్టుకున్నా ఆ తర్వాత పూర్తిగా డల్ అయ్యిపోయింది. నిర్మాత ఈ చిత్రం పబ్లిసిటీ ఎంత చేసినా నెగిటవ్ గా మౌత్ టాక్ స్ప్పెడ్ అవటం బాగా మైనస్ అయ్యిపోయింది. ఇక మరో ప్రక్క సిద్దార్ధ చిత్రం లవ్ ఫెయిల్యూర్ కూడా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. సిద్దార్ద రిలీజైన రెండో రోజే మీడియా ముందుకు వచ్చి నాకు బాగా లాభాలు మిగిల్చిన చిత్రం,నిర్మాతగా నన్ను నిలబెట్టిన చిత్రం అని మెత్తుకున్నా లాభం లేకుండా పోయింది. అందులోనూ దర్సకుడుని మీడియా ముందుకు తీసుకురాకుండా అంతా తానే చేస్తున్న పబ్లిసిటీ పెద్దగా ఫలించటం లేదు.
మొదట దిల్ రాజు తీసుకుంటానని,తర్వాత హ్యాండ్ ఇవ్వటం కూడా ఈ చిత్రంపై జనాలకి నమ్మకం లేకుండా పోయింది. దిల్ రాజు లాంటి నిర్మాతే వద్దనుకున్న చిత్రం అది అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వచ్చేసింది. ఇక ఈ చిత్రమూ పూర్తిగా కలెక్షన్స్ పరంగా అవుట్ అయ్యిపోయింది. బెల్లంకొండ సురేష్ అండతో డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ చిత్రం నిర్మాతగా సిద్దార్ధకు నష్టం తేకపోయినా,ఫెయిల్యూర్ గా మారి అతని కెరీర్ కు మరో మచ్చగా మారింది. ఇక ఈ రెండు చిత్రాలకు పోటిగా విడుదలైన సునీల్ తాజా చిత్రం పూలరంగడు మాత్రం మార్నింగ్ షోకే మీడియాలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











