Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Check 5 days collections: మరోసారి భారీగా తగ్గిన కలెక్షన్స్.. ఇంక ఎంత రావాలంటే?
యువ హీరో నితిన్ చాలా కాలం తరువాత చెక్ అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న నితిన్ కాస్త కమర్షియల్ ఫార్మాట్ ను పక్కనపెట్టి ట్రై చేసిన ఈ థ్రిల్లర్ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తోనే ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలును పెంచిన సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సీడ్ టాక్ తో వెలుతోంది. ఇక 5వ రోజు సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఈ విదంగా ఉన్నాయి.
కథతోనే అంచనాలు పెంచారు
సాహసం, మనమంతా వంటి డిఫరెంట్ సినిమాలతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మొదటి సారి నితిన్ తో చేసిన చిత్రమే చెక్. ఉరిశిక్ష పడిన ఒక చెస్ ప్లేయర్ తన తెలివితో ఏ విధంగా శిక్ష నుంచి బయట పడతాడు అనేది అసలు పాయింట్. ఈ పాయింట్ తోనే సినిమా ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంది.
ఫస్ట్ డే తరువాత తగ్గిన చెక్ హవా
అయితే చెక్ సినిమా అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటలేకపోయింది. మిక్సీడ్ టాక్ తో వెళుతున్న ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్ లో ఏమి రాలేవు. మొదటి రోజు 3.38కోట్ల షేర్స్ మాత్రమే అందుకున్న చెక్ ఆ మరుసటి రోజు నుంచి రెండు కోట్ల షేర్స్ ను కూడా అందుకోలేకపోయింది.
5వ రోజు సినిమాకు వచ్చిన కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కూడా సినిమా కలెక్షన్స్ చాలా తగ్గిపోయాయి. నైజాం 8లక్షలు, సీడెడ్ 3లక్షలు, ఉత్తరాంధ్ర 7లక్షలు, ఈస్ట్ 4లక్షలు, వెస్ట్ 2.2లక్షలు, గుంటూరు 3లక్షలు, కృష్ణా 3లక్షలు, నెల్లూరు 2లక్షలు. ఏపీ తెలంగాణలో 5వ రోజు చెక్ సినిమాకు వచ్చిన షేర్స్ 0.32కోట్లు.
నష్టపోకుండా ఉండాలంటే..
5 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 7.73కోట్ల షేర్స్ మాత్రమే అందుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 16.5 కోట్లు. ప్రాఫిట్స్ లోకి వస్తుందో రాదో తెలియదు గాని నష్టాలు రాకుండా ఉండాలి అంటే కనీసం 8కోట్లయినా రాబట్టాలి. అయితే డే బై డే మాత్రం కలెక్షన్స్ భారీగా తగ్గుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి నితిన్ చెక్ మిగిలిన రోజుల్లో ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.