Macherla Niyojakavargam Collections: నితిన్‌కు బిగ్ షాక్.. 5వ రోజు దారుణంగా.. ఇంకెంత రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగాడు యూత్ హీరో నితిన్. అయితే, మధ్యలో చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన అతడు.. మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి జనాలను ఆకట్టుకునే సినిమాలు చేస్తున్నాడు. అయితే, గత ఏడాది అతడు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. నితిన్‌కు కావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాతో వచ్చాడు.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి టాక్‌ మాత్రం ఊహించిన విధంగా రాలేదు. కానీ, కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'మాచర్ల నియోజకవర్గం' 5 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

 మాచర్ల నియోజకవర్గంలో నితిన్

మాచర్ల నియోజకవర్గంలో నితిన్


యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి రూపొందించిన మాస్ మూవీనే 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

 నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్

నితిన్ సినిమా బిజినెస్ డీటేల్స్


నితిన్ మార్కెట్‌ ప్రకారమే 'మాచర్ల నియోజకవర్గం' మూవీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలుపుకుని రూ. 21.20 కోట్ల బిజినెస్ అయింది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది


'మాచర్ల నియోజకవర్గం'కు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 37 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది


5 రోజుల్లో 'మాచర్ల నియోజకవర్గం'కు ఏపీ, తెలంగాణలో వసూళ్లు బాగానే వచ్చాయి. నైజాంలో రూ. 2.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 87 లక్షలు, కృష్ణాలో రూ. 62 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో.. రూ. 8.65 కోట్లు షేర్, రూ. 13.75 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా


యూత్ స్టార్ నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 8.65 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 42 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 38 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజులకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 15.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?


నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజులకు దీనికి రూ. 9.45 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.55 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

సగం కంటే తక్కువగా కలెక్షన్లు

సగం కంటే తక్కువగా కలెక్షన్లు


క్రేజీ కాంబోలో వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే వచ్చింది. కానీ, ఐదో రోజు ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు రూ. 1.20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఐదో రోజు మాత్రం కేవలం రూ. 37 లక్షలే రాబట్టింది. ఇది నితిన్‌కు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X