నితిన్ రంగ్ దే ప్రీ రిలీజ్ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నితిన్ నెక్స్ట్ రంగ్ దే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ నితిన్ రేంజ్ కు తగ్గట్లే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అనే విషయంలోకి వెళితే..

సక్సెల్ ట్రాక్ లోకి రావాలని

సక్సెల్ ట్రాక్ లోకి రావాలని

గత ఏడాది లాక్ డౌన్ కంటే ముందు భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న నితిన్ ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటితో ప్రయోగాత్మకమైన సినిమాను చేశాడు. చెక్ అనే ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా రంగ్ దే సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు.

ప్రమోషన్ తో భారీ హైప్

ప్రమోషన్ తో భారీ హైప్

రంగ్ దే సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ తో పాటు టీజర్ ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. దానికి తోడు చిత్ర యూనిట్ సరికొత్త కామెడీ ప్రోమోలతో జనాలను అమితంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమాలోని నటీనటులందరు తీరిక లేకుండా కష్టపడుతున్నట్లు క్లియర్ గా అర్ధమవుతొంది.

రంగ్ దే..జోడిపై పాజిటివ్ కామెంట్స్

రంగ్ దే..జోడిపై పాజిటివ్ కామెంట్స్

తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక మొదటిసారి నితిన్, కీర్తి సురేష్ కలిసి నటించడంతో జోడిపై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో ఫుల్ కామెడీతో పాటూ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయట.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో సినిమా 7.6కోట్ల ధర పలుకగా సీడెడ్ 3.6కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆంధ్ర మొత్తంలో 10కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.2కోట్లు, ఓవర్సీస్ లో 1.5కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Sri Reddy makes fun of pawan kalyan fans | Venky Kudumula | Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తంగా 21.2కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 23.9కోట్లతో మార్కెట్ లోకి వస్తోంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 24.5కోట్లు. సినిమా హిట్టవ్వాలి అంటే ఫస్ట్ వీకెండ్ లోనే భారీగా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X