Bheeshma 10 days collections: ప్రపంచవ్యాప్తంగా నితిన్ స్టామినా ఎంతంటే..
యువ హీరో నితిన్‌కు ఊరట ఇచ్చిన చిత్రం భీష్మ. గత కొద్దికాలంగా ఫ్లాప్‌లతో కొట్టుమిట్టాడుతున్న ఈ యువ హీరో, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. రోజు రోజుకు హైప్‌ను పెంచుకొంటూ భారీగా వసూళ్లను నమోదు చేసింది. రష్మిక మందన్న కెరీర్‌లో మరో హిట్‌ను చేర్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తున్నది. గత 10 రోజుల్లో భీష్మ చిత్రం ఎంత సంపాదించిందంటే..

10 రోజుల తర్వాత కూడా తగ్గని జోరు
పది రోజుల తర్వాత కూడా భీష్మ సినిమా వసూళ్లు ఏ మాత్రం తగ్గకపోవడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను చెప్పింది. 10వ రోజున ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.1.20 కోట్లు రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.35 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది. హిట్ చిత్రం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకొని నిలకడగా వసూళ్లు రాబట్టడం విశేషం.

10వ రోజున కలెక్షన్లు
ఏపీ, తెలంగాణలో భీష్మ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజాంలో రూ.52 లక్షలు
సీడెడ్‌లో రూ.11 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.13 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.8 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు
గుంటూరులో రూ.12 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.11 లక్షలు
నెల్లూరులో రూ.5 లక్షలు వసూలు చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో రూ.1.18 నమోదు అయ్యాయి.
Recommended Video


మొత్తం 10 రోజుల కలెక్షన్లు
భీష్మ మూవీ 10 రోజుల వసూళ్లు
ఏపీ, తెలంగాణలో ఇక భీష్మ చిత్రం 10 రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే..
నైజాం రూ. 8.57 కోట్లు
సీడెడ్ రూ. 3.13 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 2.86 కోట్లు
ఈస్ట్ రూ. 1.64 కోట్లు
వెస్ట్ రూ. 1.21 కోట్లు
కృష్ణా రూ. 1.44 కోట్లు
గుంటూరు రూ. 1.73 కోట్లు
నెల్లూరు రూ. 72 లక్షలు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.21.30 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోకూడా భీష్మకు మంచి ప్రేక్షకదారణ దక్కింది. కర్ణాటకలో రూ.1.88 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా భీష్మ చిత్రం రూ. 26.28 కోట్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.26 కోట్లకుపైగా షేర్, 44.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఎంత మేరకు లాభమంటే..
భీష్మ చిత్రానికి సంబంధించి 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నైజాం రూ. 6.50 కోట్లు
సీడెడ్ రూ. 3 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1.50 కోట్లు
ఈస్ట్ రూ. 1.50 కోట్లు
వెస్ట్ రూ. 1.20 కోట్లు
కృష్ణా రూ. 1.40 కోట్లు
గుంటూరు రూ. 1.75 కోట్లు
నెల్లూరు రూ. 70 లక్షలు,
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ.1.55 కోట్లు
ఓవర్సీస్ రూ.2.40 కోట్లతో మొత్తంగా రూ.21.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 26.28 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పలు ప్రాంతాల్లో లాభాలను ఆర్జించారు.


Click it and Unblock the Notifications











