భీష్మ 7 డేస్ కలెక్షన్స్.. క్రేజీ జోడీ వసూళ్ల వేట.. బ్రేక్ ఈవెన్ దాటాక కూడా!

యంగ్ హీరోహీరోయిన్లు నితిన్, రష్మిక మందన్న వసూళ్ల వేట కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 21న భీష్మ రూపంలో వసూళ్లు ప్రారంభించిన ఈ జోడీ నేటికీ ఏ మాత్రం ఆ స్పీడు తగ్గించడం లేదు. మరి మొదటి 7 రోజుల్లో భీష్మ వసూళ్లు ఎలా ఉన్నాయి? ఏడో రోజు పరిస్థితి ఏంటి? ఆ వివరాలు చూద్దామా..

 క్రేజీ జోడీ.. 7వ రోజు కూడా అదే హంగామా

క్రేజీ జోడీ.. 7వ రోజు కూడా అదే హంగామా

భీష్మ అంటూ 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చారు నితిన్, రష్మిక మందన్న. విడుదలైన రోజు మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న భీష్మ సినిమా 7వ రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్ళలో పెద్దగా డ్రాప్స్ కనిపించలేదు.

డీసెంట్ జర్నీ కంటిన్యూ..

డీసెంట్ జర్నీ కంటిన్యూ..

6వ రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన భీష్మ సినిమా.. 7వ రోజు కూడా అదే కంటిన్యూ చేసింది. వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్ళలో పెద్దగా డ్రాప్స్ కనిపించలేదు. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంతమేర డ్రాప్స్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలు ఆ లోటును పూడ్చేశాయి.

 6వ రోజుతో పోల్చితే 7వ రోజు

6వ రోజుతో పోల్చితే 7వ రోజు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7వ రోజుకు గాను కోటికి పైగా వసూలు చేసింది భీష్మ. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1. 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 6వ రోజుతో పోల్చితే పెద్దగా కలెక్షన్స్ లో డ్రాప్స్ కనిపించలేదు.

మొదటి 7 రోజులు.. రోజువారి రిపోర్ట్

మొదటి 7 రోజులు.. రోజువారి రిపోర్ట్

భీష్మ మూవీకి మొదటి రోజు 9.50 కోట్లు, రెండవ రోజు 6.50 కోట్లు, మూడవ రోజు 6.70 కోట్లు, నాలుగో రోజు 2.60, ఐదో రోజు 1.90 కోట్లు, ఆరవ రోజు 1.50 కోట్లు, ఏడవ రోజు 1. 30 కోట్లు వసూలయ్యాయి.

వరల్డ్ వైడ్ ఈ ఏడు రోజుల్లో..

వరల్డ్ వైడ్ ఈ ఏడు రోజుల్లో..

ఇకపోతే ఈ ఏడు రోజుల్లో భీష్మ మూవీ ఇండియాలో నెట్ కలెక్షన్స్ 30 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ 36 కోట్లు రాబట్టినట్లుగా రిపోర్ట్స్ అందాయి. అదేవిధంగా ఓవర్సీస్ లో వచ్చిన మరో 8 కోట్లు కలుపుకుంటే మొత్తంగా 44 కోట్లు వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

అప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు వైజాగ్

అప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు వైజాగ్

కేవలం 5 రోజుల్లోనే భీష్మ మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. దీంతో నిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన చిత్రయూనిట్.. ఫిబ్రవరి 29 న వైజాగ్ లో గ్రాండ్ థాంక్స్ మీట్ ప్లాన్ చేసింది.

Recommended Video

Bheeshma Success Meet | Filmibeat Telugu
భీష్మ మూవీ విశేషాలు

భీష్మ మూవీ విశేషాలు

నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి భీష్మ మూవీ నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X