Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
యూత్ స్టార్ నితిన్, ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో వచ్చిన చెక్ మూవీ డివైడ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచడంతో మంచి క్రేజ్‌తో ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం తొలి రోజున బాక్సాఫీస్ వద్ద ఎంత వసూల్ చేసిందంటే..

చెక్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
మీడియా వార్తలు, ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. చెక్ మూవీ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.5.4 కోట్లు, సీడెడ్ రూ.2.8 కోట్లు, ఆంధ్రలో రూ.6.8 కోట్లుతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.15 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలుపుకొని రూ.1 కోటికిపైగానే బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.16.10 కోట్ల మేర బిజినెస్ లెక్కలు తేలాయి.
కన్నడ హీరో దర్శన్ నటించిన రాబర్ట్ ప్రీ రిలీజ్ వేడుక.. తారలతో మెరిసిపోయిన ఈవెంట్

తొలి రోజున నైజాంలో
యూత్‌లో ఉండే నితిన్ క్రేజ్‌కు అనుగుణంగా నైజాంలో చెక్ చిత్రం భారీగానే వసూళ్లు నమోదు చేసింది. తొలి రోజున రూ.1.46 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే రూ.47 లక్షలు వసూలు చేసింది. అలాగే ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.34 లక్షలు కలెక్ట్ చేసింది.

ఆంధ్రాలో కలెక్షన్లు ఎంతంటే
ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రూ. 14 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.10 లక్షలు, గుంటూరులో రూ. 57.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.21 లక్షలు, నెల్లూరులో రూ.8.6 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.338 కోట్లు నికరంగా, రూ.5.34 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్ బాక్సాఫీస్ రిపోర్టు
ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో, అలాగే ఓవర్సీస్ విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.10 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.56 కోట్ల నికర వసూళ్లు, రూ.5.70 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

చెక్ మూవీ లాభాల్లోకి రావాలంటే
చెక్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడానికి రూ.16.5 కోట్ల మేర వసూళ్లు సాధించే లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజున రూ.3.56 కోట్లు వసూలు చేసిందనే లెక్క ప్రకారం.. రానున్న రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.13 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











