Don't Miss!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
యూత్ స్టార్ నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కాంబినేషన్లో వచ్చిన చెక్ చిత్రం మిశ్రమ స్పందనతో ముందుకెళ్తున్నది. చదరంగం ఆట ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సస్పెన్స్, థ్రిల్లర్ తొలి ఆట నుంచే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినాను రుచి చూపించిన చెక్ సినిమా.. రెండో రోజు ఏ మేరకు వసూలు చేసిందంటే...
చెక్ మూవీ రెండో రోజు కలెక్షన్లు
చెక్ సినిమా రెండో రోజు నైజాంలో భారీగానే వసూళ్లును సాధించింది. నైజాంలో ఈ చిత్రం రూ.74 లక్షలు వసూలు చేయగా, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు రాబట్టింది. ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రూ.8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, గుంటూరులో రూ.11.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.9.7 లక్షలు, నెల్లూరులో రూ.6 లక్షలు వసూలు చేసింది.
క్షీణించిన చెక్ వసూళ్లు
చెక్ చిత్రం తొలి రోజున రూ.3.38 కోట్ల నికర వసూళ్లను సాధించగా.. రెండో రోజు ఆ రేంజ్ కలెక్షన్లు సాధించలేకపోయింది. రెండో రోజున ఈ చిత్రం రూ.1.60 కోట్ల కలెక్షన్లను సాధించింది. రెండో రోజు కలెక్షన్లను చూసుకొంటే దాదాపు 50 శాతానికి పైగా వసూళ్లు క్షీణించాయి.
ఏరియాల వారీగా రెండు రోజుల్లో
ఇక చెక్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాలను ఏరియాల వారీగా పరిశీలిస్తే.. నైజాంలో రూ.2.20 కోట్లు, సీడెడ్‌లో 65 లక్షలు, ఉత్తరాంధ్రలో 60 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.22 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.17 లక్షలు, గుంటూరులో రూ.69 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.31 లక్షలు, నెల్లూరులో రూ.14 లక్షలు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
చెక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.5 కోట్లు నికరంగా, 9 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.14 లక్షలు, ఓవర్సీస్లో 45 లక్షలు రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5.557 కోట్లు నికరంగా, 9.5 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..
అయితే ఈ చిత్రం పీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లకుపైనే జరిగినట్టు ట్రేడ్ వర్గాల టాక్. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 10 కోట్లకుపైగానే వసూలు చేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.